పరిపాలన రాజధాని దిశగా అడుగులు పడుతున్న విశాఖ నరగాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు అత్యాధునిక మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పార్కులు, రోడ్లు, జంక్షన్లు అన్నిటి రూపు రేఖలు మారుస్తూ సుందర నగరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రత్యకంగా దృష్టి సారించడంలో ఇప్పటికే అనేక చోట్ల పలు అభివృద్ది పనులు పూర్తి చేసుకున్న తరుణంలో విశాఖ నగరం ఇప్పుడు దేశ విదేశాల నుండి వస్తున్న టూరిస్టులని ఆకర్షిస్తుంది.
తాజాగా విశాఖలోని హనుమంత వాకా జంక్షన్ వద్ద 2023 ఆగస్టు 21న 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన హనుమంతుడి విగ్రహం ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ఆకట్టుకుంది. ఆన్ మై డ్రైవ్ అరౌండ్ టౌన్ టూడే వైజాగ్ అనే టాగ్ లైన్ తో కొద్ది రోజుల క్రితం క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడీయా ప్లాట్ఫార్మ్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టుకు విశేష స్పందన వస్తోంది. సుమారు 7 లక్షల మంది ఇప్పటికే ఈ పోస్టును వీక్షించారు. ఈ సందర్భంగా వేలమంది ఫాలోవర్స్ జై హనుమాన్ అని పోస్టుకు కామెంట్స్ పెట్టారు. దీనితో విశాఖ నగర హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.