రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు సర్వత్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఆసక్తితో పాటు గందరగోళం కూడా నెలకొంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గంలో నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వర్మ సమక్షంలో జరిగిన ఎన్నికల ప్రచారం అంతా రసాభాసగా మారింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో జన సైనికుల అల్లరి తారా స్థాయికి చేరింది. ఎప్పటిలాగే సినిమా హాల్లో చేసే హడావిడి అరుపులు కేకలు ఎన్నికల ప్రచారంలోనూ కొనసాగింది. దీనితో ఒకింత కోపానికి గురైన వర్మ మాట్లాడనిస్తారా లేకపోతే మీటింగ్లో నుంచి వెళ్ళిపోమంటారా ఇది సినిమా హాల్ కాదు రాజకీయ మీటింగ్ కి సినిమా హాల్ కి తేడా తెలుసుకోండి అంటూ జనసేనకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సమక్షంలోనే వర్మ ఈ వ్యాఖ్యలు చేయటం పవన్ కళ్యాణ్ కి అవమానంగానే చెప్పుకోవాలి.
ఎందుకు అంటే తన కార్యకర్తలను సైనికులని కనీసం అదుపులో పెట్టుకోలేని పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్మ దృష్టిలో ఎంత చిన్నతనానికి గురి అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో నిండు సభలో పవన్ కళ్యాణ్ కి వర్మ అవమానం చేసినట్లయింది. పక్క రాజకీయాలు ఎంత వాడివిడిగా జరుగుతున్న సరే జనసేన ప్రవర్తనలో మార్పు రాకపోవడం పవన్ కళ్యాణ్ కి అవమానమే కాకుండా ఓటమి కూడా దారి తీస్తుంది అనే భయం జనసేన నాయకుల గుండెల్లో కొట్టుమిట్టాడుతోంది. ఏమైనా జనసైనికులు పవన్ కళ్యాణ్ కి తలవంపులు తెస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని మరొక్కసారి రుజువు చేశారు.