రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు సర్వత్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఆసక్తితో పాటు గందరగోళం కూడా నెలకొంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గంలో నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వర్మ సమక్షంలో జరిగిన ఎన్నికల ప్రచారం అంతా రసాభాసగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో జన […]
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మకి తన అనుచరుల నుండే చుక్కెదురైంది. ఇంతకాలం వర్మని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీడలా నడిచిన కార్యకర్తల నుండే వ్యతిరేకత మొదలైంది. ఒక రకంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు టిడిపి కార్యకర్తలు ఎవ్వరు కూడా వర్మ నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తమ అభిమాన నాయకుడికి టికెట్ వస్తుందని, మేమంతా ఆయన వెనుక ఉండి గెలిపించుకుంటామని కలలు కన్న కార్యకర్తల ఆశలు అడియాశలుగా మిగిలిపోయిన నేపథ్యంలో […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తర్వాత ప్రస్తుతానికి అత్యంత ఆప్తులు ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఆ నియోజకవర్గంలో తనకు గెలిచేంత సీన్ లేదని సేనానికి ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే వర్మ లేనిదే అడుగు కూడా బయటపెట్టడం లేదు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్ మంగళవారం గృహప్రవేశం చేశారు. దీనికి ముఖ్య అతిథులు ఎవరో కాదు సాక్షాత్తు వర్మ, ఆయన […]
2014 నుంచి ప్రతి సభలో, సమావేశంలో, సినిమా ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్‌ను జనసైనికులు, అభిమానులు, చోటా నాయకులు సీఎం.. సీఎం అని అరుస్తూనే ఉన్నారు. కర్ణాటకకు కుమార్‌స్వామి సీఎం అయినట్లు మా వాడు ఏదో ఒకరోజు ఏపీ ముఖ్యమంత్రి అయిపోతాడని బిల్డప్ ఇస్తుంటారు. కానీ సేనాని మాత్రం ఇప్పటి వరకు ఎమ్మెల్యేనే కాలేకపోయాడు. అసెంబ్లీ గేటును తాకి.. మైకు ముందు అధ్యక్షా అనాలని చాలా ఏళ్లుగా కోరిక ఉన్నా తీరే మార్గమే లేకుండా పోయింది. ఇందులో స్వయంకృతాపరాధమే […]