నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేశారు. తెలుగు దేశం పార్టీలో చేరితో మూడు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇటీవల కొవ్వూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డికి కాల్ చేశారు. ఆ కాల్లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు. ఈ క్రమంలో రాజేంద్రనాథ్‌ను టీడీపీలో చేరాలని సూచించారు. టీడీపీలో చేరితో మూడు కోట్ల రూపాయిలను ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. అలాగే, టీడీపీకి అభ్యర్థులు లేకపోవడంతో తనను కొవ్వూరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని అన్నారు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారని ఆమె ఈ కాల్లో వాపోయారు. ఇదే సమయంలో తాము ఓడిపోతే ప్రజలను వదిలేసి వ్యాపారాలు చేసుకుంటామని చెప్పారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పుకొచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఓడిపోతున్నారు అని మాతో ఇప్పటికే 250 కోట్ల ఖర్చు పెట్టించారు అంటూ ఫోన్ లో ఆమె ఫోన్ లో మాట్లాడటం సంచలనంగా మారింది.
కాగా ప్రశాంతి రెడ్డి ఆడియోను రాజేంద్రనాథ్ రెడ్డి బయటపెట్టారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. నా మద్దతు కోసం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్ చేశారు. నల్లపురెడ్డి కుటంబంలో విభేదాలు తేవాలని చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డిని విడగొట్టేందుకు పలు మార్లు రాజేంద్రనాథ్‌కు ఆమె కాల్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేదు. ప్రశాంతి రెడ్డికి మా కుటుంబం పేరెత్తే అర్హత కూడా లేదని రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా ఇపుడు టీడీపీ నేతల ఓటమి గురించి ప్రశాంతి రెడ్డి బాధపడుతుండడం నెల్లూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది.