వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అలియాస్ వీపీఆర్‌ను చూసి ప్రస్తుతం తెలుగుదేశం నాయకులే అయ్యో పాపం అంటున్నారు. ఈ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంట్‌కు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మహామహుల్ని కాదని, అత్యంత వివాదాస్పదమైన కిర్రాక్ ఆర్పీని వెంటేసుకుని రాజకీయాలు చేయాల్సిన దుస్థితికి వీపీఆర్ పడిపోయాడంటూ ఆయన వర్గమే బాధపడుతోంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన ఆర్పీ జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యాడు. నెల్లూరు పెద్దా్దరెడ్డి చేపల పులుసు వ్యాపారంతో నిత్యం సోషల్ మీడియాలో నానుతుంటాడు. అయితే అతనిలో ఇంకా అనేక కోణాలున్నాయి. సినిమాలు తీస్తానని పలువురిని నిండా ముంచేశాడు. రూ.కోట్లు కూడగట్టాడని తోటి నటులే ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక అవకాశాలు ఇప్పిస్తానని యువతుల ఫోన్ నంబర్లు తీసుకుని అసభ్యకరంగా మాట్లాడినట్లు ప్రచారం ఉంది. ఇలాంటి వ్యక్తిని వీపీఆర్ పక్కన పెట్టుకున్నారు.
వేమిరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి టీడీపీ టికెట్‌పై కోవూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆర్పీ అక్కడికి వెళ్లి స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్లపరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉంది. అయితే ఆర్పీ ఆయన్ను తిట్టి అభాసుపాలయ్యాడు. కానీ వీపీఆర్ కళ్లు తెరుచుకోలేదు. జబర్దస్త్‌లో ఆడవాళ్లపై నీచంగా పంచ్‌లు వేశాడు కదా.. నిజ జీవితంలో తన రాజకీయ ప్రత్యర్థులపై అదే స్థాయిలో పంచ్‌లు వేస్తే వినాలని వీపీఆర్ భావించినట్లు ఉన్నారు. అసలు వీరికి ఎలా స్నేహం కుదిరిందని తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యపోతున్నారు.
ఆర్పీకి వీపీఆర్ అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎంతో మందిని సినిమాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుంటే జనం తిట్టుకుంటారని వాపోతున్నారు. ఆర్పీ డబ్బు మనిషని జగమెరిగిన సత్యం. పైగా అహంకారి కూడా. పేదలంటే చిన్నచూపు ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీ చేపల పులుసు రేట్లు అధికంగా ఉన్నాయని యాంకర్ అడిగితే అత్యంత నిర్లక్ష్యంగా.. ‘నా రేట్లు ఇంతే. స్థోమత ఉన్న వాళ్లే తీసుకుంటారు. క్వాలిటీ వస్తువులు వాడతా.. డబ్బు ఉంటేనే తినండి. లేకపోతే పోండి’ అన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయినా అతను తన ధోరణి మార్చుకోలేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూనే ఉన్నాడు.
డబ్బు కోసమే ఆర్పీ.. వేమిరెడ్డి చుట్టు తిరుగుతున్నాడని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఆయన్ను బుట్టలో వేసుకునేందుకు రూ.కోట్లు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా ఆర్పీ పాట పాడాడు. తనపై పాటను స్వయానా వేమిరెడ్డి విడుదల చేసి మురిసిపోయారు. కానీ అక్కడున్న ఆయన మనుషులు మాత్రం వీడు చేపల పులుసు నాకినంత సులువుగా ఆయన్ను సాంతం నాకించేసేలా ఉన్నాడని చర్చించుకున్నారు.
ప్రస్తుతం వీపీఆర్ వద్ద ఆర్పీ టైం నడుస్తోంది. కానీ ఏదో ఒకరోజు అతని మోసాలు తెలియకుండా పోవు. అప్పటికే చాలా డబ్బు లాగేసి అనేక ఊర్లలో పెద్దారెడ్డి చేపల పులుసు పాయింట్లు పెట్టేసి ఉంటాడు.