ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. విజయవాడలో సీఎం జగన్ పైన రాయి దాడి తరువాత స్థానిక టీడీపీ నేత బోండా పైన విమర్శలు మొదలయ్యాయి. తాజాగా ఈ రాయి దాడి ఘటన నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరకు ప్రమేయం ఉందని సిట్ నిర్ధారించింది. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బోండా ఉమ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
కాగా ఒక మీడియాతో బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో రాయి దాడి జరిగిన సంఘటన వాస్తవమేనని, అన్న క్యాంటీన్ తీసివేయడంతో ఈ దాడికి పాల్పడ్డారని తెలిపాడు. అయినా ఆ విషయం బోండా ఉమాకు ఎవరు చెప్పారు?. నిందితుడు పట్టుకున్న పోలీసులు పూర్తి నిర్ధారణ చేయకమునుపే అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో బోండా ఉమా ఇవ్వడంతో బొండా ప్రమేయం ఈ సంఘటనలో ఖచ్చితంగా ఉంటుందని పోలీసు శాఖ భావిస్తోంది. అదే సందర్భంలో మాట్లాడుతూ మొదటి ముద్దాయికి సహకారం అందించిన వేముల దుర్గారావు సొంత మనిషి అని బోండా ఉమనే చెప్పారని గుర్తు చేసారు. సీఎం వైయస్ జగన్పై రాయి వేశారని.. బోండా ఉమానే ఒప్పుకున్నాడు.
ఈ ఘటన పైన వైసీపీ నేత వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు చేసారు. బోండా ఉమామహేశ్వర రావుకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడని, బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలని డిమాండ్ చేసారు. పోలీసు వారు ఏమి నిర్ధారించకుండానే బోండా ఉమా ఎందుకు భయాందోళనకు గురవుతున్నాడు అని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే మేమే అని టీడీపీ వారు ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారు?. పోలీస్ విచారణలో అంత బయట పడుతుంది కదా ఆలోపే కంగారు ఎందుకు? పోలీసు వారు ఇంటి దగ్గరికి రాకుండానే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావని వెల్లంపల్లి ప్రశ్నించారు. బోండా ఉమ ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తుందని వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.