రాష్ట్రంలో జగన్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. జగన్ బస్సు యాత్ర మొదలు పెట్టిన రోజు నుంచి వివిద పార్టీల నుండి వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకుల నుండి ద్వితియ శ్రేణీ నాయకుల వరకు జగన్ పంచన చేరి ఆయన చేత కండువాలు కప్పించేసుకుంటున్నారు. ప్రాంతీయతతో సంభంధం లేకుండా రాయలసీమ కోస్తా ఆంధ్ర , ఉత్తరాంద్ర నుండి పెద్ద ఎత్తున చేరికలు ఇప్పటికే జరిగిపోయాయి.
ఇక తాజాగా కడప జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్న కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిపోయారు.1994లో టీడీపీ నుండి రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టిన వీర శివారెడ్డి 2009లో దివంగత సీఎం వైయస్సార్ గారి ఆద్వర్యంలో కాంగ్రెస్ లో చేరి గెలుపోందారు . రాష్ట్ర విభజన అనంతరం 2014 , 2019 ఎన్నికలకి దూరంగా ఉన్న ఆయన 2024లో కమలాపురం టికెట్ ఆశించి టీడీపీలో చేరారు.
అయితే చంద్రబాబు వీరశివారెడ్డికి మొండి చేయి చూపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన తెదేపా కీలక నేత బీద రవిచంద్రయాదవ్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కలిసి బుజ్జగించే ప్రయత్నం చేసినా వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు వలన ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని బహిరంగంగానే చెప్పి జగన్ తోనే ఏపీ అభివృద్ది సాధ్యమని తాను నమ్ముతున్నట్టు చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కడపజిల్లాలో మరో సీనియర్ నేత వైసీపీ గూటికి చేరినట్టయ్యింది. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి (టీడీపీ) సోదరుడు శ్రీనాథ్ రెడ్డి, దంపతులు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు, గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసిన విషయం తెలిసిందే.