జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తర్వాత ప్రస్తుతానికి అత్యంత ఆప్తులు ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఆ నియోజకవర్గంలో తనకు గెలిచేంత సీన్ లేదని సేనానికి ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే వర్మ లేనిదే అడుగు కూడా బయటపెట్టడం లేదు.
గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్ మంగళవారం గృహప్రవేశం చేశారు. దీనికి ముఖ్య అతిథులు ఎవరో కాదు సాక్షాత్తు వర్మ, ఆయన భార్య లక్ష్మీదేవి, కుమారుడు గిరీశ్ వర్మ. సేనాని వర్మను అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. స్థానికంగా అతనికి ఎంతోకొంత పరపతి ఉండడం.. టికెట్ విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్‌కు గత్యంతరం లేకుండా పోయిందని ఆయన అభిమానులు వాపోతున్నారు.
వర్మ గారూ నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదేనని ఇటీవల ఓ సందర్భంలో సేనాని అన్నారు. దీనిని బట్టి ఆయన ఏ స్థాయిలో భయపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వర్మ పూర్తిగా సహకరిస్తాడనేది అనుమానమే. అందుకు రకరకాల కారణాలున్నాయి. చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్‌కు పవన్ గెలవడం అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే తండ్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని కోపంగా ఉన్నాడు. పైగా బాబు, పవన్ ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. దీనికి లోకేశ్‌ను రానివ్వడం లేదు. కుమారుడికి రాజకీయాలు తెలియవు. అతడి కోపం పోగొట్టాలంటే నమ్మించి సేనాని గొంతు కోయాలి. పైగా గెలిస్తే ఏదో ఒకరోజు పొత్తులో అడ్డం తిరుగుతాడు. అందువల్ల బాబే వర్మ ద్వారా పిఠాపురంలో జనసేనను ఓడిస్తాడని ప్రచారం ఉంది.
సేనాని ఓటమి వర్మకు కూడా చాలా అవసరం. ఎందుకంటే పిఠాపురంలోనే తను రాజకీయాలు చేయగలడు. మరోచోటు వెతుక్కునే పరిస్థితి లేదు. పవన్ గెలిచి ఇక్కడే ఉండిపోతే తనకు భవిష్యత్ ఉండదు. ఇంకా వర్మ తన తర్వాత కుమారుడి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేను చేయాలని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారు. దీనికి అడ్డుగా ఎవరూ ఉండకూడదు. అందువల్ల పవన్‌ను ఓడిస్తే అటు చంద్రబాబుకు ఉపయోగం ఉంటుంది. ఇటు తన కుమారుడికి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే పవన్ ఆలోచన మరోలా ఉంది. వర్మను వాడుకుని ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నాడు. సేనానికి ఈగో ఎక్కువ. సినీ హీరో అయిన తనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది జస్ట్ మాజీ ఎమ్మెల్యేపై ఆధారపడడం ఏంటని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎన్నికల వరకు వర్మకు సన్నిహితంగా ఉండాలని నిర్ణయిచుకున్నట్లు సమాచారం. ఒకవేళ గెలిస్తే నువ్వు నా ఫ్యామిలీ కాదని వర్మను పక్కనపెట్టేసి ఇక్కడి బాధ్యతలను నమ్మకంగా ఉండే జనసైనికులను అప్పగించేసి సినిమాలు చేసుకోవాలని, ఓడిపోతే దుకాణం కట్టేసి వెళ్లిపోవాలని భావిస్తున్నాడు. మొత్తంగా పిఠాపురం రాజకీయం రంజుగా ఉంది. కూటమిలోని పార్టీలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.