హెరిటేజ్ కంపెనీ నే తనదని ఒకసారి తనది కాదని, తమకే క్లారిటీ లేకుండా మాట్లాడే బాబు తనో తట్ట మట్టి కూడా వేయని వరికపూడిసెలని కట్టేస్తాడని ఆయన సతీమణి చెప్పుకుంటుంటే హాస్యాస్పదం గా ఉంది..
వరికపూడిసెల అనేది పల్నాడు వాసుల యొక్క దశాబ్దాల కల, 1996 మార్చ్ లో పార్లమెంట్ ఎన్నికల ముందు వెలిగొండ, ఎస్సార్స్పీ రెండో దశ, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ లతోపాటు వరికపుడిసెలకు శంకుస్థాపన చేసిన బాబు 2004 వరకు రూపాయి ఖర్చు కూడా చేయలేదు. పైపెచ్చు గొంతు ఎండి గుక్కెడు నీళ్లు పంట పొలాల కోసం అడిగిన పల్నాడు రైతులపై, నీళ్లు విడుదల చేసేది లేదు, ఇప్పుడు నీళ్లు వదిలితే మళ్లీ మళ్లీ అడుగుతారు, రైతులకు క్రమశిక్షణ నేర్పాలంటే ఇలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని రైతులకు క్రమశిక్షణ నేర్పే అహంకారం ప్రదర్శించాడు.. ఆ అహంకార ఫలితం రైతాంగం అప్పుల ఊబిలో పడి తమ కిడ్నీ లు అమ్ముకుని అప్పు తీర్చాల్సిన ఖర్మ పట్టడం. రాష్ట్రంలో 1994-2004 మధ్య బాబు హయాంలో కిడ్నీ లు అమ్మి అప్పు తీర్చే దౌర్భాగ్య స్థితి మొదట మొదలైంది మాచర్ల నియోజకవర్గం నుండే…
2008 లో జలయజ్ఞంలో భాగంగా వైయస్సార్ వరికపుడిసెల కు శంకుస్థాపన చేయగా 2009 లో ఆయన మరణించారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఇంచు ముందుకు వెళ్లలేదు. 2014 లో అధికారంలోకి వచ్చిన బాబును అసెంబ్లీ సాక్షిగా వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరికపుడిసెల ను నిర్మించాలని కోరగా, ఆ ప్రాజెక్ట్ నిర్మించాలంటే టైగర్ రిజర్వు అడ్డంగా ఉంది, పర్యావరణ అనుమతులు సాధించడం అసాధ్యం, ఆ ప్రాజెక్ట్ నిర్మించలేం అని సాక్ష్యాత్ ముఖ్యమంత్రి హోదాలో బాబే ప్రకటించాడు…
2018 లో మాచర్ల పర్యటనలో భాగంగా లోకేష్ ను స్థానిక రైతాంగం వరికపుడిసెల ను నిర్మించాలని కోరాగా, స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మమ్మల్ని అడగలేదు, ఒకవేళ ముందే అడిగి ఉంటే కట్టేవాళ్లం కదా అని వారి తండ్రి గారు అయిన బాబు అసెంబ్లీ లో అన్న మాట కూడా గుర్తు లేకుండా విమర్శ చేశాడు.. 2019 ఫిబ్రవరి లో అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరికపుడిసెల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నామ్ అంటూ 300 కోట్లతో జీవో విడుదల చేసి టెండర్లని పిలుస్తున్నాం అని ప్రకటించాడు, అప్పటికి ఒక్క పర్యావరణ అనుమతి కూడా రాలేదు. ప్రాజెక్ట్ అనుమతులు లేకుండా కనీసం ఐదేళ్లలో ఎన్నడూ అనుమతులు కొరకు ప్రయత్నం చేయకుండా, టెండర్లను కూడా పిలుస్తున్నాం అంటూ అదీ ఎన్నికలలు రెండు నెలల ముందు జీవో విడుదల చేయడం బాబు చిత్తశుద్ధికి నిదర్శనం.. ఇప్పుడు అత్యంత కష్టతరం అయిన పర్యావరణ అనుమతులు సాధించి, టైగర్ రిజర్వ్ ఉన్నా కూడా ప్రాజెక్ట్ కు అనుమతులు సాధించి ప్రాజెక్టు ను ప్రారంభించి శరవేగంగా పనులు చేస్తూ, అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేయగా, టీడీపీ లో జాయిన్ అయిన లావు కృష్ణదేవరాయలే స్వయంగా ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కఠినమైన అనుమతులు సాధించడం పూర్తి అయ్యింది ప్రాజెక్ట్ కట్టడం తేలికైన పనే అని టీడీపీ సభలోనే ప్రకటించాడు..
అధికారంలో ఉన్నప్పుడు తట్టెడు మట్టి వేయని, ప్రాజెక్ట్ కట్టడమే అసాధ్యం అన్న బాబు రేపొద్దున మళ్లీ అధికారం ఇస్తే వరికపుడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేస్తాడని బాబు సతీమణి భువనేశ్వరి మాటలు ప్రజలకు అవగాహనా రాహిత్యం లా అనిపించడంలో తప్పు లేదు..