తాను అధికారం లోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే పెడతా, అలాగే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటూ చంద్ర బాబు మరోసారి తనదైన శైలి లో మోసానికి తెరతీశాడు. ఉద్యోగాల విషయం లో చంద్రబాబు హామీ ముసలి పులి చేతిలో బంగారు కడియం లాంటిది, తనకు వేటాడే ఓపిక లేక బంగారు కడియం ఆశ చూపుతుంది, ఆశతో దగ్గరకు రాగానే ఆవురుమనిపిస్తుంది… నమ్మారా సచ్చారే….
5 ఏళ్లలో ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే గత 14 ఏళ్లలో ఆయన కనీసం 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మాటలే కదా ఎన్నైనా చెప్తాడు… అసలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటేనే బాబుకు చిన్న చూపు.. దానికి తార్కాణమే తానే స్వయం గా రాసుకున్న మనసులో మాట అనే సగం ఆత్మకథ..
ఉద్యోగ నియామకాలపై ఆ పుస్తకంలో ఇలా రాసుకున్నారు….
“ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం వృథా. ప్రభుత్వోద్యోగమనగానే శాశ్వతం, భద్రం అనే భావన పనిచేయనీయకుండా చేస్తున్నది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల వల్ల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితికి దారితీనింది. ఉద్యోగుల పెరుగుదలతో సామర్థ్యం పెరగడం లేదు. రాష్ట్రంలో ఉద్యోగుల కొరతలేదు. ఇప్పటికే వివిధ శాఖలలో లక్ష ఉద్యోగాలు అదనంగా ఉన్నాయి. సిబ్బంది పెరుగుదలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా 1994లోనే ఒక చట్టం తెచ్చాం. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, విశ్వ విద్యాలయాలు, స్థానిక సంస్థలు నియామకాలు చేయకుండా ఈ చట్టం నిరోధిస్తుంది.” (పేజీ నెంబర్ 63,64,78)
ఇది బాబు అసలు వ్యక్తిత్వం, ఉద్యోగులు దండగ, ఉద్యోగులకు ఇచ్చే జీతం దండగ, వారు సోమరిపోతులు అనేది బాబు మదిలో నాటుకుపోయిన ఆలోచన. ఇదెప్పుడో 2002 లో అన్నది, ఇప్పుడు నేను మారిపోయా, నేను మారిన మనిషిని అని మళ్లీ బొంకే అవాకాశమూ లేకపోలేదు. 2019 ఎన్నికల ముందు ఏబీఎన్ రాధాకృష్ణ తో ఇంటర్వ్యూ సందర్భంగా కూడా అనాలోచితంగా దాదాపు ఇవే మాటలు అంటూ ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికాడు బాబు..
2014 ఎన్నికల సమయం లో జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదంతో, మేనిఫెస్టో లో ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటూ ఇచ్చిన హామీ గెలిచిన వెంటనే మరచాడు.. 2014-19 మధ్య బాబు హయాంలో మొత్తం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 30 వేలే. ఇప్పుడు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తా, 20 లక్షల ఉద్యోగాలిస్తా అంటే నమ్మేవారు ఎవరు లేరు.చంద్రబాబు రాజకీయ జీవితం మోత్తంలో చెప్పిన హామీ చెప్పినట్టుగా నేరవేర్చిన ఘటన ఒక్కటీకూడా లేదు. ఈయనని నమ్మితే బూడిదే మిగులుతుందని గత అనుభవాలే సాక్ష్యం ..