రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపి, టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేడు బి ఫారాలు అందజేయనున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ రోజు ఉదయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకుని, కూటమిలో భాగంగా తమ పార్టీ పోటీ చేయబోయే 21 నియోజక వర్గాలకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బి ఫారాలు అందజేయనున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుంటడంతో పార్టీల నేతలు నామినేషన్ ప్రక్రియలు ఈ వారంలో పూర్తి చేయాల్సిన నేపథ్యంలో లేటు చేయకుండా బీ ఫారాలు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది
దీంతో జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. బి ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తి అయితే అక్కడ ఇతర ఆశావాహులకి అవకాశం లేకుండా పోయి తమ పార్టీకి సపోర్ట్ చేస్తారని భావనలో జనసేన అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 22వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో నామినేషన్ ను దాఖలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కూటమి సంబంధించిన బిజెపి టిడిపిలు తమ అభ్యర్థులకు ఎప్పుడు బీఫారాలు ఇస్తాయో ఇంకా ప్రకటించలేదు. బిజెపి టిడిపిల మధ్య ఇంకా సీట్లు పంపకాల ప్రక్రియ కొలిక్కి రాలేదు అని చెప్పవచ్చు. రెండు మూడు అసెంబ్లీ స్థానాల పైన ఇంకా స్పష్టత రాలేదు.