టీడీపీ పార్టీలో బలమైన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు రాజకీయాలలో ఎప్పుడు ఎవరో ఒకరి కుటుంబాన్ని లాగి పబ్బం గడుపుకుంటూనే ఉంటాడు. అలానే గల్లా కుంటుంబాన్ని కూడా రాజకీయాల్లో వాడుకునేందుకు ప్రయత్నించగా ఆ కుటుంబం ఏకంగా రాజకీయాలకే బై చెబుతున్నట్లు ప్రకటించిది. బాబు రాజకీయ ప్రయాణం లో ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా రాజకీయంగా భలైపోతుంటాయి అందులో ఇప్పుడు గల్లా కుటుంబం వంతు వఛ్చినట్టు అయ్యింది.
రాయలసీమ పరిధిలోని రాజకీయ కుటుంబాలన్నీ తమవారసులను వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరేడు శతాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రముఖ రాజకీయవేత్త రాజగోపాల నాయుడు వారసురాలిగా మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన గల్లా అరుణకుమారి 2019 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో రెండుసార్లు ఎన్నికైన ఆమె కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని రోజుల క్రితం అమర్ రాజా కంపెనీ పై వైసీపీ కక్ష సాధిస్తుందంటూ టీడీపీ నానా యాగీ చేసింది.. కానీ గల్లా కుటుంబం మాత్రం తమపై రాజకీయ కుట్ర సాగుతుందని ఎక్కడ మాట్లాడలేదు.. ఇతరుల లాగా దిగజారిపోయి వైసీపీ ప్రభుత్వం పై దిగజారుడు విమర్శలు, అసత్య ఆరోపణలు చేయలేదు. చూస్తుంటే అమరరాజ కంపెనీలో వచ్చిన సమస్యలు కూడా వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగానే కనిపిస్తుంది. చంద్రబాబు కుట్ర రాజకీయాల మీద ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చిన గల్లా జయదేవ్ రాజకీయాలను విడిచిపెట్టి తన వ్యాపార విస్తరణకు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంమీద ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల పాటు క్రియాశీలక పాత్ర పోషించిన కుటుంబాలలో ఒకటిగా పేరొందిన గల్లా కుటుంబం తాజా ఎన్నికలతో రాజకీయాలకు దూరం కావడం టీడీపీ స్వార్ధ రాజకీయాల ఫలితమే..