దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన జగన్ , సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునుంచే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేనన్ని అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు. విభజనతో పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్ర కృషిచేసి సత్ఫలితాలు సాధించారు. పేద బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ఎక్కడా లంచాలు తావులేకుండా సంక్షేమం అందించారు.
కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసినా 40కి పైగా సంక్షేమ పథకాలు ఆపని ఏకైక రాష్ట్రం భారత దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. ఇది జగన్ నిబద్దతకు ఒక ఉదాహరణ మాత్రమే అని ప్రజలు అంటున్నారు . రెండేళ్లు కరోనా మహమ్మారి మింగేసినా మిగిలిన మూడేళ్ళలో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు తీసుకుని వచ్చి నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారు.. ఇన్ఫోసిస్ , రాండ్ స్టాండ్ , ఏటీజీ టైర్స్, అపాచీ, సెయింట్ గోబిన్, గ్రాసిం ఇండస్ట్రీస్ , శ్రీ సిమెంట్ , సెంచురీ ప్లై ఉడ్ లాంటి అనేక పరిశ్రమలు తెచ్చి పారిశ్రామిక ప్రగతికి అడుగులు వేశారు.
ఇక యువతకి ఉద్యోగ కల్పన విషయానికి వస్తే గ్రూప్స్ , డిఎస్సీ , పోలీస్ , మెడికల్ , కొత్తగా తెచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా కలిపి సుమారు 2,36,502 ఉద్యోగ కల్పన జరిగింది. చంద్రబాబు 5ఏళ్ల కాలంలో కేవలం 34,780 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం గమనార్హం. అప్పు సైతం చంద్రబాబు పాలనకన్నా తక్కువే చేసి ఎక్కువ సంక్షేమ ఇవ్వడం జగన్ పరిపాలన దక్షతకి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక ఏపీ అభివృద్ది సూచికలు చూస్తే గత కాలం కన్నా మెరుగ్గా జగన్ పాలనలో గణాంకాలు నమోదవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. జీఎస్డీపీ , వ్యవసాయ వృద్ది, పారిశ్రామిక వృద్ది, సేవారంగం వృద్ది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తలసరి ఆదాయం పెరుగుదల, పేదరిక తగ్గుదల , ఇలా అనేక అభివృద్ది సూచకల్లో ఏపీ జగన్ పాలనలోనే మెరుగ్గా ఉండటం కాదనలేని వాస్తవం.
జగన్ 5ఏళ్ల పాలనలో విద్యా , వైద్యం పై చూపిన శ్రద్ద రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ సాక్ష్యంగా కనిపిస్తూనే ఉంది. ఇక పాలనలో తాను తెచ్చిన సంస్కరణలు సచివాలయ వ్యవస్థ , రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ సిస్టం, వాలంటీర్ సిస్టం ప్రతీ సంస్కరణ ఒక అద్బుతమైన ఫలితాన్నే ఇచ్చి దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే విధంగా మార్చారు జగన్ . ముఖ్యంగా సంక్షేమ ఫలాలు అందించడంలో ఎక్కాడా లంచాలకి తావులేకుండా నిర్మూలించడంలో జగన్ సక్సెస్ అయి దేశానికే దిక్సూచిగా మారారు.
కేవలం 5ఏళ్ళ కాలంలోనే ఇన్ని సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ది జాడలు కళ్ళ ముందే కనిపిస్తుంటే జగన్ కి ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత తమపైనే ఉందని సామాన్యుల నుండి వస్తున్న మాట. ఈ కారణంతోనే ఏ సర్వే చూసినా ఫ్యాన్ గాలి రాష్ట్రంలో బలంగా విస్తుందని నివేదికలు ఇస్తున్నాయి. మరో 5ఏళ్ళు జగన్ కే అవకాశం ఇస్తే రాష్ట్రం మరింత ముందుకు వెళుతుందని తాము బలంగా నమ్ముతునట్టు ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా మరో రెండు వారాల్లో జరగబోయే ఎన్నికల్లో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందో తేలిపోనుంది.