ఎంతో కాలంగా ఓపిక పట్టి, అన్ని చూస్తూ భరిస్తూ, ఇక తప్పక జనసేన నుండి బయటికి వచ్చిన పోతిన మహేష్ నిన్న పెట్టిన ప్రెస్‌మీట్ సంచలనంగా మారింది.. గతంలో కూడా జనసేన నుండి అనేకమంది బయటికి వచ్చారు గానీ వారందరికి పోతిన మహేష్ కి మాత్రం చాలా తేడా ఉంది. మహేష్, పవన్ కల్యాణ్ లొసుగులు అన్నీ దగ్గర నుండి చూసినట్లు ఉన్నాడు, అందుకే నన్ను గెలికితే ఇంకా నిజాలు బయటపెడతా అని డేరింగ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు… ఇక ప్రెస్‌మీట్ లో పవన్ ను సూటిగా సుత్తి లేకుండా పాయింట్ టు పాయింట్ లాజిక్ తో కొట్టాడు… “నిగ్గదీసి అడగు” స్టైల్ లో పోతిన మహేష్ సంధించిన ప్రశ్నాస్త్రాల్లో కొన్ని:
—> జనసేన పార్టీ ప్రజారాజ్యం-2 అయి తీరుతుంది రాబోయే 12 నెలలో జనసేన అడ్రస్ గల్లంతు అవుతుంది.
—> జనసేన పార్టీ మొత్తం వాట్సాప్ లోనే నడుస్తుంది. మొత్తం ఆన్లైన్ హడావిడే తప్ప గ్రౌండ్ లెవల్ లో ఊసే లేదు..
—> సుజనా చౌదరి(విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి) గతంలో మహాన్యూస్ ఛానల్ లో మీ తల్లిని దూషించారు అలాంటి సుజనాకు మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారు?
—> కన్నతల్లిని విమర్శించినవారిని, పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోయారా?
—> మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే, మీరు ఆస్తులు ఎలా కొనుక్కున్నారు?
—> మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు…
—> ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి అయ్యుండి పిఠాపురం లో గెలవడానికి వేరే పార్టీ నేత కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్?
—> అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు?
అనకాపల్లిలో నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు.. అందుకే అక్కడినుండి వచ్చేశారు అన్నది వాస్తవం కాదా?
—> త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకు పనికి రారా?
—> మంగళగిరి, విజయవాడ పశ్చిమ బీసీల నుండి తీసుకుని కమ్మలకు ఇవ్వలేదా?
—> పశ్చిమ సీటు బలహీన వర్గాలలో ముస్లింలకో, సోము వీర్రాజు లాంటి వారికి ఇవ్వచ్చుగా?
—> పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు?
—> పద్మశాలిలకు ఒక్కసీటు ఎందుకు కేటాయించలేదు?
—> సుజనా స్థానంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ దొరకలేదా? ఇదెక్కడి సామాజిక న్యాయం ?
—> నమ్మించి కాపు యువతను బలి చేయొద్దని కన్నీటితో అభ్యర్ధిస్తున్నా..
—> భవిష్యత్తు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేడు..రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేడు..
—> రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు , నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ కల్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి..
—> 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకి ఏం భవిషత్తు ఇవ్వగలరు?
—> టీడీపీ వేసే కుక్క బిస్కెట్లు మనకి వద్దు అన్నారు.. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నారు?
—> జనసేనను సీట్లు అడగకుండా బీజేపీ ఎందుకు త్యాగం చేశారో చెప్పాలి బీజేపీ, టీడీపీని సీట్లు అడిగితే మీరు ఎందుకు ఇచ్చారు?
—> పొత్తు ధర్మం బిజెపి, టీడీపీలకు లేదా, కేవలం జనసేనకు మాత్రమే ఉందా?
—> పొత్తు కుదిర్చితే ఎక్కువ స్థానాలు కోరుకోవాలి కదా.. ఎక్కువ సీట్లు సాధించాలి కదా!?
—> మీరెందుకు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించారు?
—> కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నుండి పోటీకి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా..?
—> 21 అసెంబ్లీ, 2ఎంపీల్లో ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ మాత్రమే జనసేన కోసం పనిచేసినవాళ్లకు ఇచ్చారు టీడీపీ నుండి వచ్చిన నేతలు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా?
—> జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు.. అసలు జనసేన ఎవరికోసం పెట్టారు?
—> పవన్ కల్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు రాజకీయ కుట్రలో భాగంగా కులాలకు కొమ్ము కాస్తున్నారు…
—> నాదెండ్ల మనోహర్ కు జనసేన అనే బస్సు ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్ది ముక్కలుముక్కలు చేసారు…
—> పొత్తు మరో పదేళ్లు కావాలా? ఇప్పుడు చంద్రబాబు ఆ తర్వాత, ఆ తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రిని చేయాలో చెప్తే బానిసల్లా జెండాలు మొస్తాం…
—> పిఠాపురంలో మీ ఇల్లు గృహ ప్రవేశానికి అన్నా లేజినోవా తోనే రావాలి ఇది నా కోరిక. రాగలరా?
—> నాదెండ్లా(నాదెండ్ల మనోహర్‌ను ఉద్దేశించి)… తెనాలి వస్తా, అక్కడే ప్రేస్మీట్ పెడతా… నేను చెప్పేవన్నీ నిజాలే.. నాకు దేనికీ భయం లేదు…
వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు జనసేన నుండి గానీ పవన్ నుండి గానీ సమాధానం రాలేదు. ఎప్పటికీ రాదు కూడా…