జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులను సైకోలుగా తయారు చేసేశాడన్నది సత్యం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణ విషయం. కానీ పవన్ తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే ఆ సైకోలు తట్టుకోలేరు. ఈ ఆటవిక సేన సభ్యులు ఇంట్లో వాళ్ల మీద అణువంత ప్రేమ చూపించరు. ప్యాకేజీలు తీసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించి, నిత్యం అబద్ధాలతో బతికే సేనాని మీద మాత్రం అంతులేని ప్రేమ చూపిస్తారు.
పవన్ అభిమానులకు వ్యవస్థ ఎలా నడుస్తుందో తెలియదు. అసలు అధినేతకే అవగాహన లేదు. తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో గవర్నర్ దగ్గర ప్రతిజ్ఞ చేస్తానని ఇటీవల ఎన్నికల సభలో అన్నాడు. అయ్యా పవనాలు.. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తారు. ముందు ఇది తెలుసుకోవాలి. ఎమ్మెల్యేకి, ఎంపీకి తేడా తెలియని సేనాని ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.
తాజాగా పవన్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఈయన్ను జనసైకోలు దైవాంశసంభూతుడు అనుకుంటున్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని అయినా సరే నామినేషన్ పత్రాలను నిలబడే అందిస్తారు. ఆర్ఓ (రిటర్నింగ్ ఆఫీసర్) కూర్చొని స్వీకరిస్తారు. దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇదే జరుగుతుంది. పవన్ విషయంలో అదే జరిగింది. కానీ సైకోలు ఊరుకోరు కదా. ఆర్ఓ కూర్చొని ఉన్నాడని ఆయన్ను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారిని పవన్ ఏమీ అనడు. తను సబ్జెక్టు నేర్చుకోవాలని చూడడు. అభిమానులకు చెప్పడు. వాళ్లు సమాజంలో భిన్నమైన వ్యక్తులుగా భావిస్తుంటారు.
పవన్ సినిమాల్లో హీరోనే కావొచ్చు. కానీ ఎన్నికల విషయానికొస్తే అభ్యర్థి మాత్రమే. ఆర్వో అడిగితే సమాధానం చెప్పాలి. ప్రచార సమయంలో వాహనాలు తనిఖీ చేయాడానికి వస్తే సహకరించాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాల్సిందే. అలా కాకుండా మా దేవుడ్ని నిలబెట్టారని బూతులు తిడితే సమాజం అంగీకరించదు. ఇది ప్రజాస్వామ్యం దేశం. ముందు అది గుర్తుపెట్టుకోవాలి.