వివేకా హత్య కేసు వ్యవహారం పై జరుగుతున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. చూసి చూసి జనాలకే విసుగొచ్చింది. అందుకే కేస్ డిటేల్స్ గురించి గానీ, పాత క్యాసెట్ మళ్లీ వినిపించి మళ్లీ మళ్లీ హింసించే ఉద్దేశం లేదు. సీదా పాయింట్ కి వస్తే:… నిన్న వివేకా హత్య ఉదంతంపై సీబీఐ సేకరించిన వీడియో లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది, రక్తపు మడుగులో ఉన్న తండ్రి ఫోటోలు పదే పదే చూస్తూ నవ్వుకుంటూ ప్రజంటేషన్ లు ఇవ్వడం ఏ కొడుకూ కూతురు కూడా చేయని పని. కానీ ఏదో సాధించాలి అని ఇలాంటి నీచ స్థాయికి కూడా దిగిపోతున్నారు.
ఇక ఆ ప్రజంటేషన్ కు హాజరైన విలేకరులలో ఎవరో ఓ విలేఖరి మీ నాన్న గారి రెండో భార్యా, ఆవిడ పిల్లలు ఎక్కడున్నారు అని ప్రశ్నించగా, “నో ఐడియా” అంటూ అసలు వాళ్లెవరో కూడా తెలియదు అన్నట్లు మాట్లాడింది నర్రెడ్డి సునీత. వివేకా కు రెండో పెళ్లి అయింది అనే విషయమే తెలియదు అన్నట్లుగా ఆవిడ ప్రవర్తించింది. ఈ సంఘటన నర్రెడ్డి సునీత ఏ ఉద్దేశం లో ఇదంతా చేస్తుందో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. సదరు సునీత సీబీఐ విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలం లో ” 2011 నుండి మా నాన్న గారికి దూరంగా ఉంటున్నాను, ఆయన షేక్ షమీమ్ అనే మహిళతో సంబంధం పెట్టుకోవడం నాకు నచ్చలేదు అందుకే ఆయనకి నాకు పొసగటం లేదు. పులివెందుల కూడా ఎప్పుడో ఏడాదికోసారి వెళ్తా, నా భర్తే రెగ్యూలర్ గా పులివెందుల వెళ్తారు” అనివాంగ్మూలం ఇచ్చింది. 2011 నుండి తండ్రికి ఏ కారణం గా దూరంగా ఉంటున్నారో ఇప్పుడు ఆవిడే తెలియదు అంటున్నారు సునీత. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సునీత ఉద్దేశం ఏమిటో..
అలాగే 2011 నుండి తండ్రి కి దూరంగా ఉంటూ, ఏడాదికి రెండు మూడు రోజులు మాత్రమే పులివెందుల వెళ్లే అంత తీరిక మాత్రమే ఉండే సునీత గారు, తండ్రి వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నారని సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చిన సునీత గారు, ఆయన చనిపోయిన మూడేళ్ల తర్వాత అంటే గత రెండేళ్ల నుండి నెలకు మూడు నాలుగు రోజులు తీరిక చేసుకుని మరీ ప్రెస్మీట్ లు, డిబేట్ లు పెట్టడం ఆశ్చర్యం గా ఉంది. అన్నిటికన్నా ఆశ్చర్యం తన తండ్రి ని చంపిన హంతకులకు శిక్ష పడాలి అని కోరుకోవడం తప్పు లేదు కానీ, అవన్నీ వదిలేసి జగన్ కు ఓటు వెయ్యకండి అని చెప్పుకు తిరగడం. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఓ వైఎస్ కుటుంబ ద్వేషి ని ఆధారం చేసుకుని చంద్రబాబు ఆడుతున్న నీచమైన ఆటలో సునీత ఒక పావు మాత్రమే అని రాజకీయవర్గాల్లో ఈ మధ్య కాలంలో తరచూ జరిగే చర్చ…