జగన్ గారు హంద్రీనీవా ద్వారా కుప్పం పట్టణానికి నీరు తీసుకుని వస్తానని ఇచ్చిన హమీ నెరవేర్చారు. ఈ మేరకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగు నీరు జాలాలు తెచ్చే ఏర్పాట్లు వేగవంతం చేసి నేడు హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మ జలాలని కుప్పం నియొజకవర్గంలోకి ప్రవేశపెట్టారు.
14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు కరువుతో అల్లాడుతున్న కుప్పం ప్రజల సాగు త్రాగునీటి అవసరాలని ఏనాడు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో 2019 ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికి ఈ కాంట్రాక్టు ఇచ్చి, అందులోనూ కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డాడు తప్ప, కుప్పంకు మాత్రం నీళ్లు తెప్పించుకోలేకపోయాడని కుప్పం ప్రజల మాట.
జగన్ గారు 2019లో అధికారంలోకి వచ్చాక హంద్రినీవా పనులు చేపడితే, ఈ పనులు జగన్ గారు పూర్తి చేస్తే ఎన్నికల్లో ఎక్కడ తాను ప్రజా మద్దతు కోల్పోతానో అనే ఆలోచనతో దానికి కూడా అవరోధంగా చంద్రబాబు మారిన నేపధ్యంలో. అడ్డంకులన్ని తొలగించుకుంటూ నేడు ఇచ్చిన మాట ప్రకారం కుప్పం నియోజకవర్గానికి హంద్రినీవా ద్వారా కృష్ణమ్మ జలాలు వచ్చేలా చేసి చెప్పాడంటే చేస్తాడంతే అనే ప్రజల మాటని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి జగన్.