ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ రమేష్ తో కోర్టుల్లో కేసు వేయించి వాలంటరీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దానివల్ల గత నెలలోనే ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు, మంచానికి పరిమితమైన వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వెళ్లే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. వాలంటీర్ల ద్వారా అయితే ప్రతి నెల ఒకటో తారీఖున కోడి కూయకముందే పెన్షన్లు ఇంటికి అందేవి. కానీ, చంద్రబాబు నీచ రాజకీయానికి పెన్షన్ దారులు బలైపోయారు.
అయితే ఈ నెల పెన్షన్లు సమయం వచ్చేసరికి సరిగ్గా వారం రోజులకి ముందే అదే నిమ్మగడ్డ రమేష్ తో చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయకుండా అకౌంట్స్ ద్వారా ఇవ్వాలి అని కోర్టులో మరొక పిటిషన్ వేయించాడు. ఆ రకంగా ఈ నెల పెన్షన్ల కార్యక్రమానికి మళ్ళీ మోకాలడ్డాడు. దీనితో పెన్షన్ దారులు పింఛన్ల కోసం పోస్ట్ ఆఫీస్ ల చుట్టూ తిరగలేక బ్యాంకులకు వెళ్లి తెచ్చుకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఒంట్లో ఓపిక లేని వయసులో అనేక చోట్ల ఎండలో నిలబడలేక పడిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ప్రతినెల తమ వద్దకే పెన్షన్ ఇచ్చే పరిస్థితి నుండి పింఛన్ల మీద ఆధారపడి బతికే మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ చంద్రబాబు చేసిన పాపం ఊరకే పోదని పలువురు వృద్ధులు శాపనార్ధాలు పెడుతున్నారు. కచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.