‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్నా సీఎం వైయస్ జగన్ గారి పై గత రెండు రోజుల క్రితం గుర్తుతెలియని దుండగులు రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్రమాదంలో గాయపడిన సీఎం జగన్ గారికి ఎదుటి పై తీవ్ర గాయంతో పాటు రెండు కుట్లు కూడా పడినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయినప్పటికీ కూడా కేవలం ఒకరోజు విశ్రాంతి తీసుకోని మరలా బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్.
ఆ క్రమంలోనే గన్నవరం మీదుగా గుడివాడ చేరుకున్న సీఎం వైయస్ జగన్ మేమంతా సిద్ధం సభా వేదిక పైనుంచి మాట్లాడుతూ నా నుదుటిపై వారు చేసిన గాయం… నా సంకల్పాన్ని మరింత పెంచింది. ఇలాంటి దాడులకు మీ బిడ్డ అదరడు, బెదరడు. ఒక్క జగన్ పై ఎంతమంది ఎలా దాడులు చేస్తున్నారో మీరంతా చూస్తున్నారు. అర్జునిడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రం లో కౌరవులు గెలిచినట్టుకాదు. నాపై ఒక రాయి వేసినంత మాత్రాన మన గెలుపును వారు ఆపలేరు. నాకు వారు చేసిన గాయం 10 రోజులలో తగ్గిపోతుంది. కానీ, గతంలో వారి పాలనలో వారు ఈ రాష్ట్రానికి , పేదలకు చేసిన గాయాలు ఎప్పటికీ పేదలు మరిచిపోరు.
కానీ, ఈవేళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మీ బిడ్డ జగన్ మార్క్ అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. లంచాలు, వివక్షకు తావులేని పాలన అందిస్తున్నాం. పేదలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఓర్వలేని తనం, పేదలకు మంచి జరగకూడదు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ.. అందుకే పేదలకు ఇల్లు, ఇళ్ల పట్టాలు, ఇంగ్లీష్ మీడియం, సంక్షేమ పథకాలు ఇలా మేక రకాలుగా మీ బిడ్డ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం నిరుపేదలకు అందకూడదని అడుగడుగునా బాబు అండ్ కో అడ్డుపడ్డారు. నీ ఇబ్బందులు పెట్టినా ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే దేవుని దయ మీ అందరి చల్లని దీవెనలతో మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. మనందరి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఇంతకుమించిన సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తామని తెలియజేశారు.