టీడీపీ, జన సేన, బిజెపి పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ అభ్యర్థులను ప్రకటించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన కుటిల రాజకీయాలతో తన టీడీపీ పార్టీ అభ్యర్థులను బిజెపి, జన సేన తరుపున ప్రకటించడం, కేవలం డబ్బులు చూసి మాత్రమే టికెట్ లు కేటాయించడంతో అ సీట్లలో కూడా కూటమి అభ్యర్థులు రోజు రోజుకీ దిగజారిపోతున్నారు. కింద చిత్తూరు జిల్లా నుండి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు కూటమి చంద్రబాబు నాయుడి నిర్వాకంతో కుప్పకూలిపోతుంది.
వివరాలు చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్యవేడు లో వైఎస్సార్సీపీ నుండి వచ్చిన కోనేటి ఆదిమూలంకు టికెట్ కేటాయించారు. దీనితో ఇక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలు గొడవలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు, గ్రౌండ్ లో కోనేటి ఆదిమూలం కు అనుకూలంగా లేదు అని తెలుసుకొని ఇప్పుడు అభ్యర్థి నీ మార్చే పనిలో పడ్డారు. తిరుపతిలో బలమైన టీడీపీ నాయకులను కాదు అని జన సేనకు కేటాయించారు అక్కడ పది సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న జన సేన నాయకులను కాదు అని వైసీపీ నుండి శ్రీనివాసులను తీసుకొని టికెట్ కేటాయించారు. దీనితో పాత నాయకులు జత కట్టి కూటమి అభ్యర్థి ఓటమికి కృషి చేస్తున్నరు. నగరిలో టీడీపీ కీలక నేత రాజు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు, శ్రీకాళహస్తి లో కీలక టీడీపీ నేతలు పలువురు రాజీనామా చేశారు.
ఇక రైల్వేకోడూరులో వైసీపీ నేత భాస్కర్ రావును తీసుకొని జన సేన తరుపున టికెట్ ఇప్పించారు చంద్రబాబు, ఇప్పుడు అతనికి గ్రౌండ్ లో కూటమి నాయకులు కలిసి రావడం లేదని మరో టీడీపీ నాయకుడు ఆరవ శ్రీధర్ కు జన సేన తరుపున టికెట్ ఇప్పించారు. దీనితో అసలు జన సేన పార్టీనా లేక టీడీపీ తోక పార్టీనో అర్థం కావడం లేదు అని నేతలు మాట్లాడుకుంటున్నారు. అవనిగడ్డ లో టీడీపీ ఇంచార్జీ మండలి బుద్ధప్రసాద్ ను జన సేనలో జాయిన్ చేసుకొని టికెట్ ఇచ్చేసరికి జన సేన నాయకులు కార్యకర్తలు మండలి బుద్ధప్రసాద్ ను ఓడించి తీరుతాం అని ప్రతిజ్ఞ చేశారు. పాలకొండ లో ఇదే పరిస్థితి. టీడీపీ విషయానికి వచ్చేసరికి చింతలపూడి లో ఎన్నారై కి టికెట్ ఇచ్చారు. అతని వలన గెలవలేము అని ఇప్పుడు కొత్త అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. తిరువూరు లో కొలికపుడిని అభ్యర్థిగా ప్రకటించారు లోకల్ గా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఇప్పుడు కొత్త అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఉండి నియోజకవర్గం లో రాఘురామ కృష్ణంరాజు రాకతో మూడు గ్రూప్ లుగా టీడీపీ విడిపోయింది. ఎస్ కోట లో చంద్రబాబు సీట్ల రాజకీయంతో టీడీపీ నిట్టనిలువునా రెండుగా చీలిపోయింది. పిఠాపురం సంగతి అందరికి తెలిసిందే. విజయవాడ పశ్చిమ సీటు గురించి జరుగుతున్న గొడవలు అందరికి తెలిసిన విషయమే అక్కడ బిజెపి గెలిచే అవకాశం లేదు.
ఇలా ప్రతీ జిల్లాలో గొడవలు జరుగుతున్నాయి, పరిస్థితులు చూస్తుంటే కూటమిలో మళ్ళీ ఒక 20-30 సీట్లు మార్చే ప్రయత్నలు జరుగుతున్నాయి. మళ్ళీ వారిని ఎప్పుడు ప్రకటిస్తారు, వారు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళేది చూస్తుంటే చంద్రబాబు నాయుదు తన భస్మాసుర హస్తంతో కూటమి నీ దహించివేస్తున్నాడు.