కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల పరిరక్షణ పోరాటంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ళ కృషి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రోజుల్లో తెలంగాణలో ఓటుకు కోట్ల రాజకీయాలు చేస్తూ చంద్రబాబు దొరికిపోయాడు.. ఆ కేసు నుండి బయటపడేందుకు పదేళ్ల ఉమ్మడి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల తాగు సాగు నీటి అవసరాలను తెలంగాణ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టాడు. ఉమ్మడి నీటి పారుదల ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ కు ఎంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు నోరెత్తి అడిగిన పాపాన పోలేదు.. ఫలితంగా రాష్ట్రంలో కరువు తాండవించింది.. అయితే 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మాత్రం కృష్ణా జలాలపై పోరాడుతూనే వచ్చారు. మొన్న ఆ మధ్య నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి మన రాష్ట్రానికి రావాల్సిన నీటిని మన వాటాగా తీసుకున్నాము. ఆ తరువాత రెండు రాష్ట్రాల మధ్య తగువులను తీర్చేందుకు కేంద్ర జల్ శక్తి సంఘం ఇరురాష్ట్ర ప్రతినిధులతో సమావేశం జరిపి శాశ్వత పరిష్కారానికి దారి చూపింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని నిర్దేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ను, శ్రీశైలం, పులిచింతల విద్యుత్ కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అయినా చంద్రబాబు మాట్లాడింది లేదు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజల తాగు సాగు నీటి అవసరాలు తీర్చేందుకు అలుపెరగని పోరాటం చేస్తూ.. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఎన్నో సార్లు న్యాయంగా పోరాడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక తప్పని పరిస్థితుల్లో నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేసుకుంది. దీనిపై తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చెయ్యడంతో ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇదే వైఎస్ జగన్ ముందు నుండి కోరుతున్న న్యాయం.
జనవరి 17, 2023 న ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో.. కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు.
అయితే సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని ఏపీ అధికారులు సూచించగా దానికి తెలంగాణ అధికారులు కూడా ఆమోదం తెలిపారు.. ఇలా చివరకు ఇరు రాష్ట్రాలకు మంచి జరిగేలా కృష్ణా జలాల పంపిణీ జరగాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన విజయవంతం అయ్యింది.