రాజకీయాల్లో గెలుపోవటములనేవి సహజమే.. ఈ గెలుపోటములపై ఊహాగానాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అలాగే ఈ రాజకీయ పార్టీల గెలుపోటములపై బెట్టింగులు అనేవి కూడా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఎంత నియంత్రించడానికి ప్రయత్నం చేసినా అంతర్గతంగా ఈ రకమైన పోరు జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ మీదనో లేదా తమ అభిమాన నాయకుల గెలుపుల మీదనో లేదా ఆయా పార్టీలు సంపాదించే సీట్ల సంఖ్య మీదనో ఈ బెట్టింగులు అనేవి సర్వసాధారణంగా జరిగేటువంటి అంశాలు..
అయితే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల క్రిందటి వరకు ఉన్నటువంటి ఊహాగానాలు గెలుపోటముల అంచనాలు తారుమారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న నాలుగు ప్రధాన పార్టీలు ఉండగా టిడిపి బిజెపి జనసేన కూటమి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మరొకవైపు ప్రత్యర్థులుగా ఎన్నికల పోరాటానికి సిద్ధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే గత నెల వరకు జరిగినటువంటి ఈ రాజకీయ పార్టీల ప్రత్యర్ధుల మధ్య ఉన్నటువంటి గెలుపోటముల అవకాశాలు ఊహాగానాలు ఒక్కసారిగా తారుమరయ్యాయి
నెల రోజుల క్రిందట కూటమి అధికారంలోకి వస్తుందని పందాలు కాసిన వారంతా ఇప్పుడు వైసీపీ గెలుస్తుందని రివర్స్ పందాలు కాస్తున్నారు. రెండు నెలల క్రితం వైసీపీకి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రెండు చోట్ల కలిపి 4 సీట్లు రావని.. స్టేట్‌వైడ్‌గా ఆ పార్టీకి 60 సీట్లు కూడా రావని పందాలు కాసిన వాళ్లే ఇప్పుడు జగన్ 110 + సీట్లతో అధికారంలోకి వస్తున్నాడని పందాలు కాస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. వృద్దాప్య పెన్షన్ల అంశం తర్వాత ఈ అంకె మరింత పెరుగుతుంది. రెండు నెలల క్రితం వరకు టీడీపీ కూటమి వైపు కనిపించిన సానుకూల పరిస్థితి ఇప్పుడు లేదని బెట్టింగులు కాసేవాళ్లు తమ వైఖరిని మార్చుకున్నట్టు కనపడుతోంది. వరుస సర్వే రిపోర్ట్స్ తర్వాత మారుతున్న ఈ పరిణామాలు నిజంగానే కూటమికి ఇది షాక్ ఇవ్వబోతున్నటువంటి అంశం.. అయితే రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎవరి తలరాతలు ఎలా ఉండబోతున్నాయి అనేది కాలమే నిర్ణయించిబోతుంది.