మడకశిర టిడిపి అభ్యర్థి సునీల్ మార్చడంతో మడకశిర నియోజకవర్గంలో తీవ్ర అలజడి సృష్టించారు టిడిపి కార్యకర్తలు. టిడిపి మడకశిర ఎమ్మెల్యే టికెట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు క్లారిటీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడైన సునీల్ కి మొదట టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్సీ గుండుపల్లి తిప్పేస్వామి వర్గం వ్యతిరేకించింది. తిప్పేస్వామి వర్గం వ్యతిరేకించిన రెండు నెలల పాటు సునీల్ ని ఇన్చార్జిగా అభ్యర్థిగా ఉంచారు. సునీల్ గత రెండు నెలలుగా ప్రచారం మమ్మరంగా చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం ఆ సీటుని ఏం ఎస్ రాజుకి కేటాయించారు బాబు
ఈ సందర్భంగా మడకశిర నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈరన్న కుటుంబానికి తీరని నమ్మకద్రోహం చేశాడని వాపోయారు . ఇలా టికెట్ మార్చడం కన్నా కార్యకర్తలకు కొంచెం విషం ఇచ్చి తాగమన్న తాగే వాళ్ళమని అన్నారు. ఎంఎస్ రాజు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఎంఎస్ రాజుకు కేటాయించడంతో టిడిపి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యి నాన్ లోకల్ వద్దంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అయినా ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయిస్తే టిడిపి ఓటమికి కచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడో చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేయడం న్యాయమా అని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. టికెట్ కేటాయించని వారు డబ్బు ఎందుకు ఖర్చు చేయించాలి అని నారా లోకేష్ ని ప్రశ్నించారు. నారా లోకేష్ శంఖారావం సభకి తిప్పే స్వామి సహకరించకపోతే మా సొంత డబ్బు ఖర్చు చేసుకొని సభను విజయవంతం అయ్యేలా చేశామని తెలిపారు. ఆ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ సునీల్ అభ్యర్థిగా ఉంటాడు ఎటువంటి మార్పులు ఉండవని తెలియజేసి ఇప్పుడు మార్చడం న్యాయం కాదన్నారు.