ఎన్నికల్లో టీడీపీ, బిజెపి , జనసేన పార్టీ లు పొత్తు పెట్టుకోని కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ కదనరంగంలోకి దిగారు కానీ కర్నూలు జిల్లాలో మాత్రం టీడీపీ,బిజెపి నేతలు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో కూటమి తరుపున టీడీపీ పోటీలో నిలబడింది. అయితే టీడీపీ నాయకులు బిజెపి వారిని తీవ్రంగా అవమానించడంతో బిజెపి నాయకులు కూడా ఎలక్షన్ బరిలో నిలబడ్డారు. ఇప్పుడు ఇదే కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ తరుపున జయ నాగేశ్వరరెడ్డి టీడీపీ, జనసేన కార్యకర్తలు తోడు రావడంతో నామినేషన్ దాఖలు చేశారు.
కానీ ఈ ప్రోగ్రాంకు బిజెపి నాయకులను ఆహ్వానించక పోవడంతో పాటు బిజెపి నాయకులను తీవ్ర స్థాయిలో కించ పరిచేలా వారికి అసలు ఓట్లు ఎక్కడ వున్నాయి అంటూ మాట్లాడారు. దీనితో కలత చెందిన బిజెపి నాయకులు జనసేన కార్యకర్తల సహకారంతో మురహరి రెడ్డి ఎమ్మిగనూరు బిజెపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి నాయకత్వం తమకు భీ ఫారాం ఇస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక మంత్రాలయంలో కూడా టీడీపీ,బిజెపి నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో పోరు నడుస్తుంది. ఇక్కడ టీడీపీ తరుపున రఘు వేందర్ రెడ్డి పోటిలో నిలబడ్డారు. టీడీపీ నాయకులు నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రచారానికి గానీ సభలకు బిజెపి నాయకులను పిలవకపోవడంతో పాటు చంద్రబాబు సభకు కూడా అహ్యానించకుండా అవమానించారు.దీనితో ఇక్కడ బిజెపి నాయకులు మేరిమాత అనే దళిత మహిళను అభ్యర్థిగా ఈ నెల 25వ తేదీన భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు గట్టిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు . టీడీపీ నాయకులకు మంత్రాలయం నియోజకవర్గంలో బిజెపి సత్తా చూపిస్తాం అని సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే నంద్యాల, అల్లగడ్డ, కర్నూలు, ఆలూరు, డోన్ నియోజకవర్గాల్లో కూటమి మధ్య తీవ్ర స్థాయిలో లోపల లోపల వర్గపోరు నడుస్తుంది ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకరి మీద ఒకరు పోటీ లోకి దిగుతూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చూస్తుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి కలిసి ఎలక్షన్ చెయ్యగలరో లేదో ఒక వారం రోజుల్లో క్లారిటీ రానున్నది.