వైఎస్సార్ కాంగ్రెస్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి రావడంతో పార్టీలో ఫుల్ జోష్‌లో నెలకొంది. కొంతకాలం క్రితం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడి ఉండేవాడు. అయితే ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కుమ్మక్కై వైఎస్సార్సీపీ దెబ్బ తీయాలని ప్రయత్నించాడు. ఆ ఆటలు ఎక్కువ కాలం సాగలేదు. దీంతో టీడీపీ తీర్థం పుచ్చుకుని ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్ ఇప్పించుకున్నాడు. ధన బలాన్ని ఉపయోగించి ఇతర పార్టీల నాయకులకు ఎర వేస్తున్నాడు. టీడీపీ కండువాలు కప్పేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా చేరేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు.
విజయసాయిరెడ్డి జిల్లాపై పూర్తి పట్టు సాధించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేసి.. రాష్ట్ర బాగు కోసం వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని ఇచ్చిన పిలుపునకు అనేక మంది ఆకర్షితులయ్యారు. పార్టీలో చేరికలు జోరుగా జరుగుతున్నాయి. టీడీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణి, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు బద్దేపూడి రవీంద్ర సీనియర్ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాల్లోనే.. 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. జగన్ పాలన నచ్చడంతోనే వైఎస్సార్సీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. చంద్రబాబు నాయుడు వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదు చేయించి వృద్ధులు, దివ్యాంగులకు అన్యాయం చేశాడు. వలంటీర్ల మీద ప్రతి కుటుంబం ఆధారపడి ఉంది. వారంతా టీడీపీని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ప్రాధాన్యం ఇస్తామన్నారు. జగన్‌ను రెండోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పారు.