2019లో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న సమయంలో హైదరాబాద్ కి వెళ్తున్న జగన్ పైన విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడి కత్తితో దాడి చేసిన జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను విశాఖ కేంద్ర కారాగారం లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీను నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటూ కట్టు కథనాలు అల్లిన ఎల్లో మీడియా .
దానితో పాటు శ్రీను కుటుంబ సభ్యుల్ని మీడియా ముందుకు తెచ్చి అమాయకుదైనా శ్రీనుకి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ అసత్య ఆరోపణలు చేయించింది. నాటి ప్రతిపక్ష నేత పై హత్యా యత్నం చేసి ఆ కేసులో జైల్లో ఉన్న నేరస్తుడికి కోర్టు బెయిల్ ఇవ్వాలి కానీ ప్రభుత్వం కాదని తెలిసి కూడా ఇలాంటి చిల్లర ఆరోపణలు చేయడం ఎల్లో మీడియాకే సాధ్యం .
కాగా శ్రీను నిరాహార దీక్ష చేస్తున్నాడన్న కథనాలు ఆవాస్తవం అని విశాఖ జైల్ సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ తేల్చి చెప్పారు.
నిజానికి కోడికత్తి శ్రీను కి ఎయిర్పోర్ట్ లో ఫ్యూజన్ ఫుడ్ హోటల్ లో ఉద్యోగం కల్పించింది, పటిష్టమైన సెక్యూరిటీ దాటి హత్యాయత్నం జరగటానికి అవకాశం కల్పించింది . చంద్రబాబు అత్యంత సన్నిహితుడు టీడీపీ లీడర్ హర్ష వర్ధన్, దాడికి పథకం అల్లేది మీరే, దాడి చేసిన వాడిని అమాయక చక్రవర్తిగా చిత్రకరించేది మీరే, ఇలా అయితే ఎలా బాబు.