నాకు ఇవే ఆఖరి ఎన్నికలు అని ప్రకటించిన బాబు 2024 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తపనతో 2023 మే 28 న మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించారు. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి రైతుకూ ఏటా 20000 రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పారు.
ఈ హామీ కాకుండా బాబు తనయుడు నారా లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రలో రైతులకు అనేక హామీలు ఇచ్చారు. అవి వరసగా
(రచయిత నోటీసుకి రానివి మరికొన్ని హామీలు ఉండొచ్చు.)
హామీలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి కానీ, చంద్రబాబు గతం చూస్తే మహాద్భుతంగా కనపడుతుంది. 2004 లో అధికారం కోల్పోయిన బాబు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తర్వాత 2014 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక లక్ష్యంతో అనేక పొత్తులు పెట్టుకోవటంతో పాటు 650 హామీలతో జంబో మేనిఫెస్టో రూపొందించాడు.
ఆ హామీల్లో రైతు రుణమాఫీ ప్రధాన హామీ. 2014 ఎన్నికల నాటికి విభజిత ఆంధ్రప్రదేశ్లో రైతులు బ్యాంక్స్ నందు తీసుకొన్న వ్యవసాయ రుణాలు వడ్డీతో కలిపి 84000 కోట్లుగా ఉంది. ఈ బకాయిలు ఎవరూ కట్టొద్దని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బకాయిల రద్దు ఫైల్ పైనే తొలి సంతకం పెడతానని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మాఫీ పై చేయకుండా ఓ కమిటీ వేసి నానా రకాల నిభందనలు పెట్టి చివరికి అయిదు విడతలుగా 24000 కోట్లు మాఫీ చేస్తానని ప్రకటించారు. అయితే అది కూడా అమలు చేయకుండా 2019 నాటికి మూడు విడతలుగా కేవలం 14500 కోట్లు మాత్రమే మాఫీ చేసిన బాబు మొత్తం ఎలా చేస్తాం రైతులకు అత్యాశ పనికిరాదు అంటూ రైతులని నిందించటంతో ప్రపంచం నివ్వెరపోయింది .
వాటితో పాటు నాడు బాబు రైతులకు ఇచ్చిన మిగతా హామీలు, వాటి అమలు కూడా చూద్దాం.
వ్యవసాయానికి అనుసంధానం చేయలేదు కానీ నీరు చెట్టు అంటూ టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకొన్న పధకానికి ఉపాధి హామీని అనుసంధానం చేసి వారి దోపిడీకి మరింత సాయం చేశారు.
ఇలా 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి తూట్లు పొడిచిన బాబు గారు మళ్ళీ అన్నదాత పధకం అంటూ ప్రతి రైతుకి యేటా పదిహేను వేలు పెట్టుబడి సాయం అందజేస్తానంటే రైతులే కాదు కాస్త జ్ఞానం ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా నమ్మడు.
ఇహ జనం తన మాట నమ్మరు అని చంద్రబాబుకి కూడా అర్ధమయ్యింది అనుకొంటా. అందుకే యువగళం పేరిట కొడుకుని జనాల్లోకి పంపి మళ్ళీ అతని చేత రైతులకోసం అంటూ దాదాపు యాభై హామీలు ఇప్పించాడు బాబు. ఆ హామీల్లో కూడా ప్రధానమైనవి చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయకుండా మోసం చేసినవే అటూ ఇటూ మార్చి చెప్పాడు ఆ తండ్రి చాటు బిడ్డ.
విత్తు ఒకటి అయితే చెట్టు ఒకటి అవుతుందా, తండ్రి అమలు చేయకుండా మోసం చేసిన పధకాలు కొడుకు చేస్తాడా?? . అందునా మళ్ళీ సీఎం అభ్యర్థి మా నాన్నే అని లోకేష్ నే ధ్రువీకరించాడు కూడా. చంద్రబాబు అన్నదాత పేరిట యేటా ఇస్తానన్న ఇరవై వేల పధకం అమలు చేయడు, లోకేష్ చెప్పిన యాభై హామీలు అమలు కావని ప్రజలకు బాగా తెలుసు