ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీలో ఓటమీ భయం పెరుగుతూ తన వికృత చేష్టలను బయట పెట్టుకుంటూ వస్తోంది. పల్నాడు జిల్లాలో మొన్నటి వరకు టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్న ఏకైక నియోజకవర్గం చిలకలూరిపేటలో రోజు రోజుకి బరితెగించి దాడులు చేసేంతాల ఓటమి భయం పట్టుకుంది. నియోజకవర్గంలోనీ రూరల్ మండలం ఈవూరిపాలెం గ్రామం టీడీపీకి కంచుకోట లాంటిది. ఈ ఊరిలో ఇప్పటివరకు టీడీపీ ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చెయ్యడానికి కూడా సాహసించలేదు.ఎలక్షన్ సమయంలో పోలింగ్ బూత్ ని తమ అధీనంలోకి తీసుకోని టీడీపీకి అనుకూలంగా రిగ్గింగ్ చేసుకొని ప్రత్యర్ధి పార్టీలను తరుముతారు.
అలాంటి గ్రామంలో జగన్ ప్రభుత్వములో అందిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీసీ,ఎస్సీ,మైనారిటీ వర్గాల్లో వైసీపీ మీద ఆదరణ పెరిగి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలవడం , కొద్ది మంది యువత గ్రామంలో వైసీపీ పార్టీ తరపున ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు అదే సమయంలో పేట ఎంపీ వైసీపీ అభ్యర్థిగా మాస్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్, ఎంఎల్ఏ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు రావడం వారు అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో గ్రామంలో పార్టీల జెండ కట్టడం ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు.
ఇది చూసిన టీడీపీ పెద్దలకు మన గ్రామంలో ప్రత్యర్ధి పార్టీ ప్రచారం ఎలా చేస్తారు అంటూ గ్రామానికి వచ్చిన వైసీపీ ప్రచార రథం మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి అడ్డుకున్న డ్రైవర్, వైసీపీ కార్యకర్తల మీద దాడి చేసి గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఈవూరిపాలెం గ్రామానికి చేరుకుని నిరసన తెలియచేస్తుంటే 300 మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చెయ్యడానికి దూసుకొచ్చారు అయితే పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని భావించిన పోలిసులు ఇరు పార్టీలను చెదరగొట్టి పరిస్థితిని కంట్రోల్ చేశారు. దీనిమీద మనోహర్ నాయుడు పోలీసులకు ఫిర్యాధు చేసి మా కార్యకర్తల మీద దాడి చేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదు అంటూ తెలిపారు.