సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీలకు దిక్కుతోచడం లేదు. సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. ఓ వైపు చంద్రబాబు నాయుడు, లోకేశ్ రా కదలిరా, శంఖారావం సభలకు పూర్తిగా స్పందన కరువైంది. తెలుగు తమ్ముళ్లే పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నోవాటెల్‌లో గురువారం భేటీ నిర్వహించారు. దీనికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని హాజరయ్యారు. బాబు, పవన్ కలిసి ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయించారు. లేకపోతే ఎన్నికల రేస్‌లో బాగా వెనుకపడిపోతామని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే వరకు ఒక్క భారీ సభ జరగలేదని, జనం మరిచిపోతున్నారని తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఉమ్మడి సభ నిర్వహణకు అంగీకరించినట్లు తెలిసింది. •సభకు ఎంతమందిని రప్పిస్తే జనం దృష్టిలో పడే అవకాశముంది?, ఎంత భారీగా వస్తే పోటీలోకొస్తాం?, అసలు అక్కడికి వచ్చే ప్రజలకు ఏ విషయాల గురించి చెప్పాలి?, పొత్తులు ఖరారు కాని నేపథ్యంలో అభ్యర్థులుగా ఎవరిని చూపించాలి?, నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఇరు పార్టీల నేతలు గొడవలు పడుతున్న నేపథ్యంలో సభకు జన సమీకరణ చేస్తారా?, మేనిఫెస్టో ప్రకటిస్తే ఎలా ఉంటుంది?, పొత్తుకు ఇంకా ఓకే చెప్పని నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతల్ని ఆహ్వానం పంపాలా? వద్దా?.. ఒకవేళ పిలిస్తే జనం ఏమనుకుంటున్నారు? తదితర విషయాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. మొత్తానికి జగన్ వ్యూహాలకు ప్రతిపక్షాలు ఢీలా పడిపోయాయి.