ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఓటుకు నోటు లాంటి అనైతిక చర్యలకి పాల్పడి హైదరాబాద్ వదిలేసి వచ్చి శివరామ కృష్ణన్ కమిటీ రిపోర్టుకి వ్యతిరేకంగా నారాయణ కమిటీ వేసి మూడు పంటలు పండే భూమిని నాశనం చేసి. ల్యాండ్ పూలింగ్ కత్తి రైతుల మెడపై పెట్టి. రియల్ ఎస్టేట్ వ్యాపార ధన దాహంతో రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు 5ఏళ్ల పాలనలో అమరావతి పేరున చేసిన భూ దోపిడికి ఇప్పటికే ఆ పార్టీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అవసరానికి మించి చేసిన ల్యాండ్ పూలింగ్ వలన రాష్టానికి మోయలేని ఆర్థిక భారం పడిందని కాగ్ సైతం గత ప్రభుత్వ విధానాలపై అక్షింతలు వేసింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించినట్టు కేవలం అమరావతి రాజధాని పేరున మౌళికసధుపాయాలు కల్పించడనికే లక్షల కోట్లు వెచ్చించడం రాష్ట్ర ఆర్ధిక దృష్ట్యా సరైన పద్దతికాదని గ్రహించిన జగన్ గారు అధికారంలోకి రాగానే పరిపాలనా వికేద్రీకరణలో భాగంగా అటూ రాయలసీమకు, ఇటూ ఉత్తరాంద్రకి సమన్యాయం చేయాలనే ఆలోచనతో పరిపాలనా రాజధానిగా ఇప్పటికే అభివృద్ది చెందిన విశాఖను , న్యాయ రాజధానిగా కర్నూలు , శాసన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి వికేoద్రీకరణకు బాటలు వేసారు.
అయితే లక్షల కోట్ల భూముల స్కాంకి పాల్పడ్ద టీడీపీ వారి బినామీ వర్గం రైతుల ముసుగులో కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడం తెలిసిందే. ప్రజలకి ఈ విషయాలు ఏమి తెలీయదన్నట్టు రాజధాని లేకుండా జగన్ చేశాడని టీడీపీ ఆరోపించడం చూస్తే భార్యని హత్యచేసిన భర్తే తనకి భార్యలేదని చెప్పినట్టుగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. విశాఖలో కేసులు తేలే వరకు రాజధాని పేరిట కనీసం ఒక్క ఇటుక కూడా వేయకూడదని ఆర్డర్ తెచ్చి విశాఖ అభివృద్దిని అడ్డుకున్న వీళ్లే, నేడు జగన్ విశాఖలో కనీసం ఒక్క ఇటుక అన్నా వేశాడా అంటూ ప్రశ్నించడం దొంగే దొంగా దొంగా అన్నట్టు ఉందని విశాఖ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.