రాష్ట్రంలో ఏ మూల ఏ నేరం జరిగిన దాని మూలాలు టీడీపీలోనే తేలటం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. పైగా గత కొంతకాలంగా టీడీపీనేతల మాటలు అరాచకాలకు ఆజ్యం పోస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగే వారి అడుగులు పడుతున్నాయి. అందుకు బలం చేకూర్చేలాగే టీడీపీ నేతలు మాటలు ఉన్నాయి ..
గతంలో ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బహిరంగంగానే చెప్పాడు . ‘తరమండి రా నా కొడుకులను’ అంటూ చంద్రబాబు టీడీపీ శ్రేణులను పోలీసుల మీదకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదకి ఉసిగొల్పాడు. తద్వారా కార్యకర్తల మధ్య విధ్వంసాలు సృష్టించి వేడుక చూశాడు. అల్లర్లు అరాచకాలు సృష్టించడంలో తండ్రికి ఏమాత్రం తగ్గని లోకేష్ కుప్పం ఎన్నికల సమయంలో మీ మీద ఎన్ని కేసులు పెట్టిన భయపడొద్దు 24 గంటల్లో బెయిల్ తెప్పిస్తా అంటూ టీడీపీ శ్రేణులను ప్రత్యక్షంగానే అల్లర్లకు దాడులకు ప్రేరేపించాడు.
ఇదే క్రమంలో తిరుపతిలో జరిగిన మినీ మహానాడు సభలో టీడీపీని అధికారం లోనికి తేవడానికి అవసరమైతే మర్డర్లు చేస్తానని టీడీపీ నేత బొళ్ళి భాస్కరనాయుడు చెప్పిన మాటలు మీడియా ముఖంగా రికార్డ్ అయి ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఒక అడుగు ముందుకేసి టీడీపీని గెలిపిస్తే మీ మీద ఉన్న రౌడీషీట్లు ఎత్తివేస్తామంటూ ఓపెన్ గానే టీడీపీ నేతలు రౌడీ షీటర్లకు ఆఫర్లు ఇచ్చిన పరిస్థితి కూడా చూశాం.
అలాగే కొడాలినాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను చంపితే నా వంతుగా 50 లక్షలు ఇస్తానని మాజీ టీడీపీ నేత మల్లాది వాసు చెప్పిన సంగతి మనమంతా విన్నాం. అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతలను “పాతేస్తా నాకొడకా” అంటూ బెదిరించిన ఘనుడు టీడీపీ నేత బొండా ఉమ.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని హత్య చేయించాలని కి’రాయి’ రౌడీలను పురమాయించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ నేతలు నేర ప్రవృత్తి మరి మాటల్లో ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంటుంది. అరాచకాలు అల్లర్లు సృష్టించడం ద్వారానే అధికారంలోకి రాగలమని వారి అడుగులు ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉన్నాయి.