పోటా పోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో విడుదల అత్యంత కీలకంగా మారింది. సాధారణం గా ప్రత్యర్థి పార్టీలు తమ మేనిఫెస్టోతో ప్రజలను ఎంతవరకు సంతృప్తి పరచగలరు అనే దానిమీద గెలుపు ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాజకీయ పార్టీలు ఒకరిని మించి ఒకరు ఆ మేలు మీద హామీలు ఇస్తూ ప్రజలను నమ్మించడానికి నానా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కూటమి Vs వైసిపి మేనిఫెస్టో లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది .
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న జగన్ తను చేయగలిగింది మాత్రమే చెప్తాను చెప్పింది మాత్రమే చేస్తాను అంటూ సాధ్యమైనంత వరకు గతంలో ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైన అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, వాహన మిత్ర, వృద్ధులు, వికలాంగుల, వితంతు పింఛన్లు లాంటి పథకాలలో కొద్దిపాటి పెంపును చూపిస్తూ, పూర్తిస్థాయిలో రాబోయే ఐదేళ్లలో తాను ఏం చేయగలడో దాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి లోబడి మానిఫెస్టోను విడుదల చేశాడు. ఎక్కడ సాధ్యం కానీ హామీలకు అవకాశం లేకుండా పూర్తిగా తాను నమ్మి, చేయగలుగుతాడనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించే విధంగానే మేనిఫెస్టోని సిద్ధం చేశాడు.
అయితే అధికారమే పరమావధిగా అడుగులు వేసే చంద్రబాబు ఎప్పటిలాగే అలవికాని హామీలతో ప్రజలను వంచించడానికి మరోసారి ముందుకు వచ్చాడు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు అయ్యే ఖర్చు మొత్తం చూస్తే దాదాపుగా ఏటా 1.65 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. అంత మొత్తంలో సొమ్మును సమకూర్చుకోవడం చంద్రబాబుకు ఎంతవరకు సాధ్యం? అసలు రాష్ట్రంలో ఆ స్థాయిలో ఆర్ధిక వనరులు ఉన్నాయా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలకు సుమారుగా అవసరమయ్యేది కేవలం 70 వేల కోట్లు మాత్రమే అంచనా.. జగన్ ఇచ్చిన హామీలు ఆర్థిక క్రమశిక్షణకు అందుబాటులోనే ఉన్నాయి తప్ప, దాటి లేవు.
అయితే చంద్రబాబు మేనిఫెస్టో నమ్మశక్యంగా లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని నోటికి వచ్చిన హామీలను ఇచ్చుకుంటూ పోతే ఇన్ని లక్షల కోట్లు ఎక్కడినుండి తీసుకువస్తాడో చంద్రబాబు కే తెలియాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. 70 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇచ్చిన హామీలకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు 1.65 లక్షల కోట్లతో అలవికాని హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్ ఎలా చేస్తావు అంటూ చంద్రబాబు మ్యానిఫెస్టో పై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఇలాగే 2014లో 650కు పైగా హామీలతో ఇచ్చిన మేనిఫెస్టోను టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వెబ్సైట్ నుంచి మాయం చేసిన విషయం మనందరికీ తెలిసిందే.