రెండవరోజు కొనసాగుతున్న వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం ప్రచార యాత్రలో భాగంగా సీఎం జగన్ తో జరిగిన ముఖాముఖిలో స్వాతి అనే మహిళ మాట్లాడుతూ “నేనొక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మిమ్మల్ని మీరు మహిళలకు అందించే ధైర్యాన్ని చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఇప్పుడు ఎంపీటీసీగా పనిచేస్తున్నాను.దేశం మొత్తంలోనే యంగ్ అండ్ డైనమిక్ సీఎం మీరు. మిమ్మల్ని జగనన్నా అనకుండా గౌరవపూర్వకంగా సర్ అని పిలుస్తాను. అన్నా అంటే బంధం మాత్రమే అవుతుంది. మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే.
విమెన్ ఎంపవర్మెంట్తో మాకు ఎంతో శక్తిని ఇచ్చారు మీరు. ఎక్కడో ఉన్న మమ్మల్ని సమాజంలో మీ సమస్యలను పరిష్కరించుకుని సాధికారతను సాధించుకోమని 50% రిజర్వేషన్ కల్పించారు, ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనిపించేలా చేసారు. మాకేం జగన్న ఉన్నారు….పిల్లలను చదివిస్తారు, బ్యాంక్ లోన్స్ సహా ఏది కావాలన్నా మీ ఆధ్వర్యంలో మాకు అందుతున్నాయి. రాష్ట్రంలో పేదరికం అనే మాట డిక్షనరీ నుండి నెమ్మదిగా తగ్గిపోతోంది. లంచం అనేమాట విని ఐదేళ్లు అవుతోంది. ఇది వాస్తవం. ఇక్కడ మీతో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నేరుగా మీకు లేఖే రాసేదాన్ని. ఈ ప్రభుత్వంలో మాకు ఎంతో నచ్చింది స్వయంపరిపాలనే. ఒక్క సర్టిఫికెట్ కావాలంటే రోజులు, నెలలు పట్టేది. ఇప్పుడు సచివాలయాల వల్ల ఒక్కరోజులో సర్టిఫికెట్ వస్తోందని తెలిపారు.