కూటమిలో లుకలుకలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనానికి పిలిచి టీడీపీ కార్యకర్త సన్నాసిరావుని రూమ్ లో బంధించి యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ పిఏ, డ్రైవర్ కలిసి చెక్కలతో కుర్చీలతో చితకబాదారు. దీనితో సన్నాసిరావు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న అచ్యుతాపురం ఎస్ కె ఆర్ ఫంక్షన్ హాల్లో యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం […]