మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కీలకనిర్ణయాలు.
1.
మహిళా సాధికారతకు, స్వావలంబనకు వెన్నుదన్నుగా నిలుస్తూ… ఫిబ్రవరి 16 నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం.
ఫిబ్రవరి 16 నుంచి రెండు వారాలపాటు జరగనున్న చేయూత లబ్ది పంపిణీ.
మేనిఫెస్టోలో ఇచ్చిన మరోముఖ్యమైన హామీ అమలు.
నాలుగేళ్లలో ప్రతి మహిళకూ రూ.75వేలు అందించిన వైయస్.జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం.
నాలుగో విడతలో 26,98,931 మందికి రూ.5060.4 కోట్లు.
ఈ పథకం వల్ల దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందారు.
వీరందరి జీవితాలు బాగు పడ్డాయి.
నెలకు అదనపు ఆదాయం రూ.7–10వేల వరకూ సంపాదించుకునే అవకాశం ఏర్పడింది.
ఆగస్టు 12, 2020న మొదటి విడతలో 24,00,11 మందికి రూ.4500.2 కోట్లు పంపిణీ.
రెండో విడతలో రూ.4,679 కోట్లు, 24.95 లక్షల మందికి పంపిణీ.
మూడో విడతలో 26.39 లక్షల మంది మహిళలకు రూ.4.949 కోట్లు పంపిణీ.
ఇప్పుడు నాలుగో విడత కింద 26.98 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున రూ.5060 కోట్లు పంపిణీ.
దీంతో ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.75 వేల లబ్ధి.
దీంతో ఈ పథకం కింద నాలుగు విడతల కలిపి సుమారు రూ.19,188 కోట్ల పంపిణీ.
పేద అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్సార్ చేయూత, దేశంలో ఎక్కడా, గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన అక్కచెల్లెమ్మలకు చేయూత కార్యక్రమం, తద్వారా జీవనోపాధి కల్పన.
45 నుండి 60 ఏళ్ళ మధ్య వయస్సు గల అక్కచెల్లెమ్మలను ఒక తోడబుట్టిన అన్నలా, తమ్ముడిలా తోడుగా ఉంటూ వారిని చేయి పట్టుకుని నడిపిస్తూ , వైయస్సార్ చేయూత ద్వారా ఏటా రూ. 18,750 ల చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు వరసగా క్రమం తప్పకుండా నాలుగేళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం అందించడంతో పాటు వారికి జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ అండగా నిలబడుతున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం.
2.
ప్రతి గ్రామపంచాయితీకి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
500 లోపు జనాభా ఉన్న పంచాయితీలకూ సెక్రటరీల నియామకం.
ఒక గ్రామ పంచాయతీలో ఒకరికన్నా ఎక్కువ ఉన్నవారిని ఈ పంచాయితీల్లో నియమించనున్న ప్రభుత్వం.
3.
నిరుద్యోగులకు శుభవార్త. మెగా డిఎస్సీ.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్న కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.
డిఎస్సీ–2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమం, సాంఘిక, బీసీ సంక్షేమశాఖల పరిధిలోని స్కూళ్లలో 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
2019 నుంచి ఒక్క విద్యారంగంలోనే 14,219 టీచర్ పోస్టులను భర్తీచేసిన ప్రభుత్వం.
సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడిన 7,761 పోస్టులను దీంట్లో భాగంగా భర్తీచేసిన ప్రభుత్వం.
డిఎస్సీలో అర్హులైన అభ్యర్ధులకు దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్ల వయో పరిమితి.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితిని సడలింపు.
రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు పరీక్షల నిర్వహణ.
8 రోజుల పాటు టెట్ నిర్వహణ.
అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ.
ఇప్పటికే 2.13 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రస్తుత ప్రభుత్వం.
తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 7వేల పోస్టుల భర్తీ.
మొత్తం 2.20లక్షల పోస్టుల భర్తీ.
4.
ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం.
ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్న కేబినెట్.
పేదలకు, సంపన్నులకు తేడా నాణ్యమైన విద్యమాత్రమే.
ఇదే ఐబీ విద్యవిధానం కావాలనుకుంటే ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ చెల్లిస్తున్న పరిస్థితులున్నాయన్న కేబినెట్.
సంపన్నుల పిల్లలకు అందుబాటులో ఉండే డిజిటల్ సదుపాయాలు, ఐఎఫ్‌పీలు, ట్యాబులను మన పేదపిల్లలకు అందుబాటులోకి తీసుకు వచ్చాం.
దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ నాణ్యమైన విద్యను అందించడానికి బోధనలో ఐబీని భాగస్వామ్యం చేస్తున్నాం.
మన రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి ఉద్యోగాలను అందుకోవాలన్నదే లక్ష్యం.
ఇవాళ ఒకటో తరగతి విద్యార్థి తన చదువు పూర్తిచేసుకునే సమయానికి అత్యంత సమర్థతను సంతరించుకుంటాడు.
ఐబీ కూడా ముందుకు రావడం హర్షణీయం.
ప్రభుత్వంతో ఒప్పందం కారణంగా ఐబీ సంస్థ ఉదారంగా ముందుకు వచ్చింది.
సంపన్నుల పిల్లలకే కాదు నిరుపేదలకూ తాము సేవలందిస్తామని ఐబీ ముందుకు వచ్చింది.
2024–25లో ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికార్లకూ శిక్షణ ఇచ్చి వారి సామర్ధ్యాన్ని, నైపుణ్యాలను పెంచి 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ.
జూన్ 2026 నాటికి రెండో తరగతిలో ఐబీ.. ఇలా ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. 2035 నాటికి టెన్త్ క్లాస్ ఐబీ, 2037 నాటికి పన్నెండోతరగతి విద్యార్థులు ఐబీలో పరీక్షలు రాస్తారు.
ఈ పరీక్షలు రాసిన తర్వాత వచ్చే సర్టిఫికెట్ ఐబీతో జాయింట్ సర్టిఫికెషన్ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ యూనివర్శిటీల్లో ప్రవేశాలు మెరుగుపడతాయి.
విద్యారంగంలో చరిత్రాత్మక మార్పునకు దీనిద్వారా మరో అడుగు పడుతుంది.
నేడు ధనిక, పేద విద్యార్థుల మధ్య ఉన్న విద్యాంతరాలను రూపుమాపేలా అంతర్జాతీయ విద్యాబోధన ఐబీని సైతం ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్న జగనన్న ప్రభుత్వం..
మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా, నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు..
ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వ బడులలో అంతర్జాతీయ విద్యాబోర్డు ఐబీ భాగస్వామ్యం..
ప్రభుత్వ బడులలో ఐబీ భాగస్వామ్యం చేయాలన్న ప్రతిపాదనను ఆంగీకరించిన మంత్రిమండలి.
5.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్ధల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీవిరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
6.
ఏపీ డిస్కమ్స్‌కు రూ.1500 కోట్ల రుణాలపై ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం.
7.
అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపు(పీవీజీటీ) ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ.89.98 కోట్లతో ఏపీడీస్కమ్స్ రూపొందించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఆమోదించిన మంత్రిమండలి.
8.
1500 మెగావాట్ల సామర్ధ్యంతో సౌరవిద్యుత్ ఉత్పత్తికి గ్రీన్కో ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి కేబినెట్ ఆమోదం.
నంద్యాల జిల్లా గడివేముల మండలం చిన్నక్కపల్లెలో 1272.07 ఎకరాలు, మిడ్తూరు మండలం మాసాపేట, నాగలూటి గ్రామాల్లో 1011.44 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో అవసరమైన భూములు గుర్తింపు.
9.
3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్.
వైయస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్ 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు.
దాదాపు రూ. 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్.
ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.
ఆమోదం తెలిపిన కేబినెట్.
10.
నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రెండు విండ్‌పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్.
171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు.
రూ.1287 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు.
ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
11.
శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.
రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ.
వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు.
ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
12.
కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
రూ.1350 కోట్లు ఖర్చు, 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.
13.
సోలార్, విండ్‌తో సహా పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇండోసోల్ సోలార్ పవర్ ప్రయివేటు లిమిటెడ్ సంస్ధకు అవసరమైన భూములు
కేటాయించేందుకు ఎస్పీవీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
14.
శ్రీ సత్యసాయి మరియు అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్న రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్.
దీనికోసం రూ.3600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ.
600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.
15.
అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో భాగంగా
150 మెగావాట్లు చొప్పున 9 యూనిట్లు ఏర్పాటుకు సంబంధించిన పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేయాలన్న ఏపీజెన్కో ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి.
రూ.12,264.36 కోట్లతో ఏర్పాటు కానున్న పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
16.
రెండు విడతల్లో ఏసీసీ సిమెంట్స్ ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు కేబినెట్ ఆమోదం
ఏడాదికి 8 మిలియన్ టన్నుల క్లింకర్, 4 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి
రెండు విడతల్లో ఈప్రాజెక్టుకు రూ.5400 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఏసీసీ
800 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు.
36 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి, ఇప్పటికే ఎస్ఐపీబీ ఆమోదం.
రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.
17.
లిథియం అయాన్ రీసైక్లింగ్, ఇ–వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్న అగర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
మూడు విడతల్లో మొత్తంగా రూ.3,200 కోట్ల పెట్టుబడి.
ప్రత్యక్షంగా 3,200 మందికి ఉద్యోగాలు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం.
18.
రాష్ట్రంలో రెండు విడతల్లో 15 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేయనున్న రియలన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్.
దీనికోసం రూ.1920 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రియలన్స్ బయో ఎనర్జీ
1920 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాల కల్పన. రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.
19.
బియ్యం ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేయనున్న పట్టాభి ఆగ్రో ఫుడ్స్ లిమిటెడ్.
రెండు విడతల్లో రూ.1153 కోట్లు పెట్టుబడి.
2500 మందికి ఉద్యోగాలు కల్పించనున్న కంపెనీ.
మంత్రివర్గం ఆమోదం.
20.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జామియా మసీదు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ఆస్తిపన్ను మినహాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.
21.
నేచురల్ గ్యాస్‌మీద ప్రస్తుతమున్న వ్యాట్ టాక్స్‌ను 24.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
22.
లార్జ్ అండ్ మెగా ప్రాజెక్టులకు వివిధ పాలసీల్లో భాగంగా రాయితీలు ఇవ్వాలన్న స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
23.
4వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం.
24.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ఇన్సూరెన్స్ ఫండ్ రూల్స్ 2024 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
25.
చట్టసభలకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు, అధికార్లకు, చట్టసభల సిబ్బందికి, ఇతర ప్రభుత్వ అధికార్లకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ లెజిస్లేచర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్ధ ఏర్పాటు చేయడంతో పాటు డైరెక్టర్(నాన్ కేడర్) పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
26.
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సెక్రటేరియట్లో 27 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
27.
ఆంధ్రప్రదేశ్ అడ్వోకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ –1987 సవరణలకు కేబినెట్ ఆమోదం.
28.
ఆంధ్రప్రదేశ్ అడ్వోకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ –1992 సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
29.
పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిధిలో 5376 నిర్వాసిత కుటుంబాలకు… ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఇస్తున్న ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన రూ.52 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.8 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
30.
ప్రముఖ చెస్ క్రీడాకారిణి కుమారి కోలగట్ల అలనా మీనాక్షికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో 500 గజాల నివాస స్ధలాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో 1000 చదరపు గజాల నివాసస్ధలాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలకూ కేబినెట్ ఆమోదం.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మల్లవారిపాలెంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐఐటీ), శ్రీసిటీ ఏర్పాటుకు అవసరమైన 42.23 ఎకరాల భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.