చంద్రబాబుకు ఎన్టీఆర్ ఓ పేరు పెట్టారు. అదే జామాత దశమగ్రహం. బహుశా దీనికి గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. పిల్లనిచ్చిన మామ తన అల్లుడికి ఈ పేరు ఎందుకు పెట్టాడో కాస్త వివరంగా చూద్దాం. ఇప్పుడంటే బాబు ఎన్టీఆర్పై ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన దేవుడని పొగుడుతున్నాడు. మీటింగుల్లో విగ్రహాలకు పూలమాల వేసి నమస్కారాలు పెడుతుంటాడు. ఆయన్ను తలుచుకుంటే ఏ పనైనా అయిపోతుందని చెబుతుంటాడు. భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటాడు. (మనసులో మాత్రం ఇవ్వకూడదని ఉంటుంది. ఎందుకంటే అత్యున్నత పురస్కారాన్ని రామారావు భార్య లక్ష్మీపార్వతి తీసుకుంటుందని..), శత జయంతి ఉత్సవాల పేరుతో హంగామా చేశాడు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ఉంది.. అదే 1995 సంవత్సరంలో వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కున్న సందర్భం. ఇది అందరికీ తెలిసే ఉంటుంది.
ఇదీ నేపథ్యం
తెలుగుదేశంలో ఆగస్ట్ సంక్షోభం. 90ల్లో రాజకీయాలు చూసిన వారికి దీని గురించి బాగా తెలుసు. పిల్లనిచ్చిన మామపైనే బాబు చెప్పులు వేయించాడు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి ఎన్టీఆర్ను సీఎం కుర్చీ నుంచి దింపాడు. పార్టీని తన చేతుల్లోకి లాక్కున్నాడు. ఇందుకోసం ఆ పెద్దాయన కొడుకులు, కుమార్తెల్ని వాడుకున్నాడు. ఈ వెన్నుపోటుతో ఎన్టీఆర్ బాగా కుంగిపోయారు. ఇది ఆయన మరణానికి దారి తీసింది. పదవి పోయాక ఆయన అల్లుడిపై పలుమార్లు విరుచుకుపడ్డారు. దరిద్రుడు, నీచుడు, చండాలుడంటూ తిట్టి పోసిన వీడియోలు అడపాదడపా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. కాగా ఎన్టీఆర్ అల్లుడు చేసిన దారుణాలపై 45 నిమిషాల ఆడియో క్యాసెట్ విడుదల చేశారు. అదే జామాత దశమగ్రహం.
ఆడియోలో ఏం ఉందంటే..
జామాత దశమగ్రహం ఆడియో ‘మీ అన్నను మాట్లాడుతున్నా. శ్రద్ధగా ఆలకించండి.’ అంటూ మొదలవుతుంది. సీఎం చంద్రబాబు, గర్నవర్ కృష్ణకాంత్, స్పీకర్ వై.రామకృష్ణుడు తెలుగుదేశంలో సంక్షోభానికి కారణం. హరికృష్ణ నా మాటలు వినేవాడు. పదవీ కాంక్షతో బాబు అతడిని నా నుంచి దూరం చేసి కవ్వించి ఉసిగొల్పాడు. కార్యకర్తలకు అన్యాయం జరిగిందని చెప్పాడే తప్ప.. ఎలాంటి అన్యాయం జరిగిందో చెప్పలేదు. గాంధీని చంపిన గాడ్సే కంటే ఘాతకుడు చంద్రబాబు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న లక్ష్మీపార్వతిపై నిందలు వేయించి అమ్మను మించిన అత్తమ్మ అనే విషయాన్ని విస్మరించి ద్రోహం చేశాడని వ్యాఖ్యానించారు. ‘అనుకున్నది సాధిస్తే గానీ నిద్రపోని ఎన్టీఆర్’ అని చెప్పడంతో ఆడియో ముగుస్తుంది. ఈ 45 నిమిషాల్లో రామారావు తన బాధను, అల్లుడు చేసిన ద్రోహాన్ని స్పష్టంగా చెప్పారు. ఇది విడుదలయ్యాక ఎవరైనా అల్లుడిపై కోపంతో తిట్టాల్సిన సందర్భం వస్తే జామాత దశమగ్రహం అనేవారు.
ఫొటోలు తీయించివేసి..
1999లో బాబు మళ్లీ సీఎం అయ్యాక క్రమంగా ఎన్టీఆర్తో ఇక పనిలేదని ఆయన పేరు కనుమరగయ్యేలా దుర్మార్గపు చర్యలు తీసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫొటో లేకుండా చేశాడు. పార్టీ కార్యాలయాల్లోనూ ఆనాడు అదే పరిస్థితి ఏర్పండి. ఎన్టీఆర్ అంటే బాబుకు విపరీతమైన కోపం ఉంది. అందుకే పార్టీలో ఆయన పేరు వినపడకుండా చేసి.. తనను తిట్టిన పగను అలా తీర్చుకున్నాడు. 2004, 09 రెండు ఎన్నికల్లో ఓడిపోయాక నారా వారికి మామతో అవసరం వచ్చింది. మూలన పడేసిన ఫొటోలకు బూజు దులిపి ఆయన రాగం అందుకున్నాడు. ఆగస్ట్ సంక్షోభాన్ని జనం మరిపోవాలని ఎన్నో చేశాడు. రామారావుకు ఆఖరి రోజుల్లో పట్టెడన్నంపెట్టని సంతానం చేత అప్పుడు జరిగింది తప్పు కాదని చెప్పించాడు. లోక కల్యాణం కోసం అలా చేశానని సమర్థించుకున్నాడు. చనిపోయిన తర్వాత కూడా తనను జామాత దశమగ్రహం వదల్లేదని ఫీలవుతూ ఉండొచ్చు ఎన్టీఆర్