2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూడు ఏకమై కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే… అయితే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఆయా పార్టీల నాయకులు నేతలు కార్యకర్తలు మధ్య సఖ్యత కుదర్చడం కోసం, ఎలాంటి మనస్పర్థలు లేకుండా పొత్తు ముందుకు సాగేలా వారి మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం కోసం మూడు ప్రధాన పార్టీల నాయకులు ఆత్మీయ సమావేశాలను, కార్యకర్తల మీటింగులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు.
ఆ క్రమంలోనే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి.. ఆ సందర్భంగా మూడు పార్టీల కార్యకర్తలు నేతలతో కలిపి రాజమండ్రిలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. అయితే బీజేపీతో పొత్తు కుదిరింది మొదలు సీట్ల పంపకాలలో వచ్చిన తేడాలు కావచ్చు స్థానికంగా ఆ నాయకులు మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు. ఎక్కడా మూడు పార్టీల కార్యకర్తలు నేతలు కలిసికట్టుగా ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.ఈ ఆత్మీయ సమావేశంలోనూ అదే జరిగింది.
ఇక్కడ కూడా పురందేశ్వరి సమక్షంలోనే ఆమె చూస్తూ ఉండగానే టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు తన్నుకున్నారు. సమావేశంలో పార్టీల నాయకులు మధ్య మాటా మాటా పెరిగి మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఆత్మీయ సమావేశం పేరిట వేసిన బ్యానర్ ని సైతం చించివేశారు. కళ్ళముందు ఇంత జరుగుతున్నా చేసేది ఏమీ లేక, ఏమీ చేయలేక బిక్కమొహం వేయడం పురంధేశ్వరి వంతు అయింది. కొట్టుకుంటున్న కార్యకర్తలని కనీసం వారించే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేక స్థితిలో మౌనంగా ఉండిపోయింది. నీకు ఒక్క రాజమండ్రి ఆత్మీయ సమావేశంలోనే ఇలా జరిగింది అనుకుంటే పొరపాటు.. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఈ మూడు పార్టీలు కలిపి సమావేశాలు ఏర్పాటు చేసిన రసభాస్ తప్ప మరొకటి లేదు. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో కూటమి పొత్తు ఎంతవరకు పొడుస్తుందో లేక వికటిస్తుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పురంధేశ్వరి సాక్షిగా తన్నుకున్న @JaiTDP, బీజేపీ, @JanaSenaParty కార్యకర్తలు!@BJP4Andhra తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీచేస్తున్న పురంధేశ్వరి అక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు
సమావేశంలో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్న మూడు పార్టీల కార్యకర్తలు. ఆత్మీయ సమావేశం బ్యానర్… pic.twitter.com/ObZrd4dUsW
— YSR Congress Party (@YSRCParty) April 9, 2024