2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ కి విచ్చేసిన నరేంద్ర మోడీ సమక్షంలో సోము వీర్రాజు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనుసరించిన ద్వంద్వ విధాలను సోము వీర్రాజు ఎండగట్టారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు వద్దన్నాడో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును సభలు పెడుతున్నాడని, ఎవ్వరైనా సరే వెళ్లి ప్రశ్నిస్తున్నారు? అంటూ నిలదీశారు.
చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా వద్దన్నాడంటూ, ఎందుకు చంద్రబాబును నిలదీయట్లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రతి దానికీ బీజేపీనే ఎందుకు సమాధానాలు, వివరణలను ఇచ్చుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని బీజేపీని ప్రశ్నించడం కాదని, దాన్ని ఎందుకు వద్దాన్నాడో చంద్రబాబును అడగాలని సూచించారు సోము.
ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబుకు గానీ, టీడీపీకి గానీ బీజేపీ అవసరం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మా సహకారంతో 2014లో అధికారంలోకి వచ్చి మళ్లీ మమ్మల్ని విమర్శిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. నోటాతో బీజేపీ పోటీ పడుతోందంటూ టీడీపీ నాయకులు చాలాసార్లు తమను విమర్శించారని, ఇప్పుడు మళ్లీ మాతో ఏమి అవసరం వచ్చిందని అని అడిగారు. సోము వీర్రాజు నుంచి ఇలాంటి ప్రసంగం ఎవరు ఊహించలేదు, ఆయన మాట్లాడిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కూటమి పొత్తులో ఉన్న ఇలా బహిరంగంగానే బిజెపి నేతలు చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.