ఒకవైపు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటుంటే , మరోవైపు తన కుంభకోణాలు తన వెంట పడుతున్నాయి. రెండిటితో ఎటు తేల్చుకోలేక రఘురామ కృష్ణ రాజు సతమతం అవుతున్నాడు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన కొన్ని రోజులకే పార్టీకి దూరమయ్యాడు, అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేక ప్రాజెక్టులను రఘురామ కృష్ణం రాజు చేయాలి అనుకోవడం అందుకు జగన్ మోహన్ రెడ్డి సముఖత చూపకపోవడంతో రఘురామ దూరం అయ్యాడు. అలా దూరమైన రఘురామకృష్ణంరాజు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఏ కార్యానికి శ్రీకారం చుట్టిన కోర్టుకు వెళ్లడం, వాటిని ఆపాలి అనుకోవడం, కోర్ట్ చేత మొట్టికాయలు తింటూ రావడం ఇదే పరిపాటిగా మారింది. ప్రస్తుతం బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ కృష్ణంరాజు దర్యాప్తుపై స్టేను ఎత్తేయాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది.
కేసు విషయానికి వస్తే రఘురామ కృష్ణంరాజు థర్మల్ పవర్ కంపెనీ స్థాపిస్తామని బ్యాంకుల నుంచి ఇన్డ్-భారత్ కంపెనీ పేరుతో రూ.974 కోట్లు రుణం తీసుకున్నారు.ఇన్డ్-భారత్ కంపెనీ కోసం నిధులు ఖర్చు చేయకుండా తీసుకున్న రుణాన్ని ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రఘురామ మళ్లీ రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని దారి మళ్లించడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణ జరగకుండా రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కానీ సిబిఐ ఇప్పుడు దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే అడ్డుపడుతోందని , ఆ స్టే ఎత్తివేయాలని సుప్రీంకోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను రెండు వారాలు పాటు వాయిదా వేసింది. ఒక వైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా సమయం ఇక్కడ ఏమో ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు, మరో వైపు సిబిఐ వెంట పడుతుండడంతో రఘురామ పరిస్థితి గోడ దెబ్బ చెంప దెబ్బలా తయారైంది.