Sixth List : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులను వేగంగా ప్రకటిస్తోంది. ఇప్పటికే ఐదు జాబితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే(Sixth List). శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమన్వయకర్తల వివరాలను వెల్లడించారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రాజమండ్రికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నర్సాపురానికి లాయర్ గూడూరి ఉమాబాల, గుంటూరుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరుకు (ఎస్సీ) ఎన్.రెడ్డప్ప, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మైలవరానికి సర్నాల తిరుపతిరావు యాదవ్, మార్కాపురానికి అన్నా రాంబాబు, గిద్దలూరుకు కె.నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీకి (నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్) ఎండీ ఖలీల్ అహ్మద్, గంగాధరనెల్లూరుకు కె.నారాయణస్వామి, ఎమ్మిగనూరుకు బుట్టా రేణుక నియమితులయ్యారు.
వారికి ప్రాధాన్యం
నియామకాల్లో జగన్ వెనుకబడిన తరగతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నర్సాపురం సీటును గతంలో ఓసీకి ఇవ్వగా ఈసారి బీసీ వర్గానికి చెందిన మహిళను ఎంపిక చేశారు. రాజమండ్రికి కూడా బీసీనే నియమించారు. మైలవరంలో గతంలో ఓసీ పోటీ చేయగా ఈసారి ఆ స్థానం బీసీకి దక్కింది. నెల్లూరు సిటీని ముస్లింలకు కేటాయించారు. కొత్త జాబితాలో ఐదు కొత్త ముఖాలున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ 63 అసెంబ్లీ, 16 లోక్‌సభ స్థానాలను ప్రకటించింది. వారిలో శాసనసభకు సంబంధించి 21 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 18 మంది బీసీలు, ఐదుగురు మైనార్టీలు, 16 మంది ఓసీలున్నారు. పార్లమెంట్‌కు సంబంధించి బీసీలు 9 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీలు నలుగురున్నారు.
బాబూ చూస్తున్నావా..
చంద్రబాబు నాయుడు ఇంత వరకు అధికారికంగా జాబితాలు విడుదల చేయలేదు. ఆంధ్రజ్యోతిలో మాత్రం లీకుల మీద లీకులు ఇస్తున్నారంతే. దీంతో టీడీపీ, దానితో పొత్తులో ఉన్న జనసేనలో అసంతృప్తి రేగుతోంది. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు.