గతవారం భీమిలిలో జరిగిన సిద్ధం మొదటి సభ సక్సెస్ ను ప్రతిపక్షాలు మరిచిపోక ముందే, నిన్న దెందులూరులో జరిగిన సిద్ధం రెండవ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యి వారికి మరింత గాభరాను పుట్టిస్తుంది.
అనుకూల మీడియాలో, వైసీపీ పనయిపోయిందని, జగన్ మీద వ్యతిరేకత ఉందనీ, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారనీ ఎంత ప్రచారాలు చేయించినా సిద్ధం సభలకు తరలివస్తున్న జనాన్ని చూసి చంద్రబాబుకి గుబులు పట్టుకుంటుంది.
టీడీపీ నిర్వహిస్తున్న రాకదలిరా సభలు అంతగా సక్సెస్ అవ్వకపోవడం, ప్రణాళిక ప్రకారం వారు అనుకున్నన్ని సభలనూ, ఆ సభలకు జనాన్ని రప్పించి లేకపోవడం వంటి వాటిని బేరీజు వేసుకుని టీడీపీ ఊసు జనంలో లేదని మధనపడుతున్నారు. మొదటి రా కదలిరా సభ సక్సెస్ అవుతుందనుకున్న సమయానికి జూనియర్ యన్టీఆర్ అభిమానులతో సున్నం పెట్టుకోవడం వంటివి ఆ సభ ముఖ్యోద్దేశాన్ని దెబ్బ తీసింది.
రా కదలిరా అంటూ కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో సభలు పెట్టాలనీ, ఆ సభలకు కనీసం యాభై వేలమందిని అయినా తీసుకురావాలని టీడీపీ వేసుకున్న లెక్కలు పారలేదు. అంతేకాక ఇప్పుడు సడెన్గా ఆ సభలను కూడా నిర్వహించకుండా చంద్రబాబు నానుస్తూ ఉండటంతో చంద్రబాబు పై ప్రజలకే కాక టీడీపీ వారికి కూడా నమ్మకం తగ్గుతూ వస్తుంది.