వివేకానంద హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, సునీత,షర్మిలపై ఆలాగే టీడీపీ అనుకూల మీడియా మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ సార్వత్రిక ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్యను పదే పదే ప్రస్తావిస్తూ షర్మిల, బీటెక్ రవి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నరెడ్డి సునీత తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. దీనితో తనకు ఇబ్బంది కలుగుతుంది, నా రాజకీయ భవిష్యత్ కు నేను పోటి చేస్తున్న పులివెందులలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ దస్తగిరి హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు.
ఏపీలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ఇలాంటి తరుణంలో సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అని తిరిగి ఈ వార్తలను పదేపదే ప్రచారం చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈ- టీవీ లను కూడా ఆ పిటీషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. దానితో పాటు కడప ఎంపీ గా పోటీ చేస్తున్న షర్మిల గత నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రతీ చోట ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాత్రమే ప్రచారం చెయ్యడం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చెయ్యడం మీద దస్తగిరి తన పిటీషన్ లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిబంధనలలో స్పష్టంగా పోటీలో వున్న వ్యక్తుల మీద వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ సునీత, షర్మిల, చంద్రబాబు నాయుడు, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అందరూ ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అంటూ దస్తగిరి కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. అలాగే తన మీద వివేకానంద రెడ్డి హత్య కేసులో వీరు మాట్లాడిన అభ్యంతరకరమైన ప్రసంగాల పై తక్షణమే కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా కోరారు దస్తగిరి.
పులివెందుల నుండి పోటీ చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్ర ఇబ్బందిగా మారబోతుంది కేవలం రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీ అండదండలతో ఇలాంటి ఆరోపణలు చేయటం ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి వ్యతిరేకమని దస్తగిరి పేర్కొన్నారు.తక్షణమే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా షర్మిల , బీటెక్ రవి, సునీత, చంద్రబాబు నాయుడులతో పాటు, మీడియాకు ఆదేశాలు ఇవ్వాలని దస్తగిరి పిటీషన్ లో కోర్టును కోరారు.వీరందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు,తక్షణమే రాష్ట్ర హైకోర్ట్ వారు ఎలక్షన్ కమిషన్ కు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో అభ్యర్థించాడు దస్తగిరి.పిటిషనర్ దస్తగిరి తరఫున వాదనలు వినిపించనున్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.