చంద్రబాబు పేరు చెబితే ప్రజలు మోసగాడినే చూస్తారు. ఇచ్చిన మాటపై నిలబడిన చరిత్ర లేదు. ఏ వర్గానికీ మంచి చేసిన దాఖలాల్లేవు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తు పెట్టుకునేలా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అయితే మైకు దొరికితే అంతా నేనే.. అంతా నా వల్లే అంటుంటాడు. ఇక జగన్ విషయానికొస్తే మాట ఇస్తే చేసేంత వరకు ఊరుకోడు. ఒకవేళ ప్రజలకు మాట ఇవ్వకపోయినా వారికి మంచి జరుగుతుందంటే వెంటనే ఆ పని చేసేందుకు వెనుకాడడు. భరత్ అనే నేను సినిమాలో హీరో చిటికేసి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు గురించి చెప్తాడు. ఈ విధంగా జగన్ చెప్పాల్సి వస్తే చిటికెలు వేసి వేసి వేళ్లు నొప్పి పుట్టడం ఖాయం. 2019లో ఆయన సీఎం అయ్యాక అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
వెలిగొండ కల సాకారం
పూల పుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం, నెల్లూరు, సీమలోని వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల స్వప్నం ఇది. 1996లో లోక్‌సభ ఎన్నికల గండాన్ని గట్టేందుకు చంద్రబాబు దీనికి హడావుడిగా శంకుస్థాపన చేశాడు. 2004 వరకు ఆయన కేవలం రూ.10 లక్షలు మాత్రం ఖర్చు పెట్టాడు. అది కూడా శంకుస్థాపన కోసమే. ఏనాడు రూపాయి విదల్చలేదు. వైఎస్సార్ 2004లో సీఎం అయ్యాక లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దీని పనులకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా నల్లమల సాగర్‌తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమల సాగర్‌తో అనుసంధానించి 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులు చేయించారు. ఆయన మరణానంతరం పనులను ఎవరూ పట్టించుకోలేదు. 2014లో సీఎం అయిన బాబు వెలిగొండను కామధేనువుగా మార్చుకున్నాడు. కాంట్రాక్టర్లకు రూ.650 కోట్లను దోచిపెటి కమీషన్లు దండుకున్నాడు. 2019లో సీఎం అయిన జగన్ వెలిగొండను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.1,046 కోట్లు ఖర్చు పెట్టారు. చిత్తశుద్ధితో వ్యవహరించి కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా మొదటి టన్నెల్‌ను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. రెండో టన్నెల్ పనులు ఈనెల 23వ తేదీన పూర్తయ్యాయి. జగనన్న దీనిని ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా మార్చేశారు. రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటి పారుదల సొరంగాలుగా ప్రసిద్ధికెక్కాయి.
ఉద్దానానికి ఊపిరి
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న సమస్యకు జగన్ తన పాలనలో పరిష్కారం చూపారు. ఇక్కడ జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. గత పాలకులు వీరి గురించి పట్టించుకున్న పాపానపోలేదు. బాబు అధికారంలో ఉన్నప్పుడు వీరి విషయంలో కనికరం చూపలేదు. తిత్లీ తుఫాన్ సమయంలో సర్వం కోల్పోయిన ఇక్కడి బాధితులు సమస్య చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తే బాబు నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కిస్తా అంటూ మాట్లాడాడు. కొందరిపై కేసులు పెట్టారు. ఆయన దత్తపుత్రుడు ఉద్దానం ప్రజలతో రాజకీయాలు చేశాడు. 2017లో దీక్ష పేరుతో డ్రామా ఆడాడు. బాబుతో పొత్తులో ఉన్న సమయంలో ఈ సమస్య పరిష్కారానికి పవన్ చొరవ చూపలేదు. జగన్ ఆదుకుంటానని బాధితులకు మాట ఇచ్చారు. సీఎం అయ్యాక ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.10 వేలు అందిస్తున్నారు. రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.87 కోట్లతో పలాసాలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లలో బెడ్స్ సంఖ్య పెంచారు. కొత్త సెంటర్లు ప్రారంభించారు. రోగులకు 37 రకాల మందులు అందుబాటులో ఉంచారు.
పల్నాడు రైతుల కల వరికపూడిసెల ప్రాజెక్టు
వరికపూడిసెల ఎత్తిపోతల పథకం.. పల్నాడు ప్రజల కల ఇది. దీని సాకారానికి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు మాత్రం 1966 నుంచి ఎన్నికల్లో దీనిని ప్రచార అస్త్రంగా మార్చుకున్నాడు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే రెండుసార్లు శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత దానిని పట్టించుకోలేదు. జగన్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి అనుమతులు సాధించారు. తొలిదశ పనులను రూ.340.26 కోట్లతో చేసేందుకు సీఎం గతేడాది శంకుస్థాపన చేశారు. అధునాతన పైపులైన్లు వేసి వ్యవసాయానికి నీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన వాటికే జగన్ మళ్లీ శంకుస్థాపన చేస్తున్నాడంటూ తెలుగుదేశం అవహేళన చేసింది. అయితే ఆనాడు పర్యావరణ అనుమతులు తీసుకోని విషయం, నిధులివ్వని వారు మర్చిపోయినట్లు ఉన్నారు. జగన్ అలా కాదు. అనుమతులు తెచ్చి నిధులు విడుదల చేసి పనులు చేయిస్తున్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు, ప్రజలకు తాగునీటి సరఫరాకు శ్రమిస్తున్నారు. ఇదే బాబు, జగన్‌ల మధ్య తేడా. నారా వారు కేవలం మాటలు చెప్తారు. ఎల్లో మీడియా ద్వారా మాయ చేస్తారు. రాజన్న తనయుడు జగన్ ఏదైనా చేతల్లో చేసి చూపిస్తారు. తప్పుడు ప్రచారం చేసేందుకు ఇష్టపడరు.