స్వశక్తితో ఎదుగుతున్న ఆడవారిపై బురదజల్లడం తెలుగుదేశం, జనసేన పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. టూరిజం వాహనాలను ప్రారంభించే క్రమంలో మంత్రి రోజా బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ఎవరంటూ రోజా ప్రశ్నించారు? 7’O క్లాక్ బ్లేడ్‌తో కోసుకుని చస్తానన్నవాడు ఆయనేనా అని ప్రశ్నించిన రోజా ఒక మహిళా కష్టపడి పైకి వచ్చిన వారిపై నీచంగా మాట్లాడటం జనసేన టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ రోజా మండిపడ్డారు. గతంలో రోజా డైమండ్ రాణి అని, పులుసు పాప అంటూ బండ్ల గణేష్ రోజాను విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తీరును రోజా దుయ్యబట్టారు.
చంద్రబాబు మాయలో పడిన పవన్ కళ్యాణ్ బాబుకు ఊడిగం చేస్తూ పాతాళంలోకి కూరుకుపోయారని రోజా ఎద్దేవా చేశారు. పవన్ ఇప్పటివరకూ మండల, బూత్ కమిటీలు వేయలేదు. 24 సీట్లు తీసుకొని జనసేన నేతలకు అన్యాయం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇన్నేళ్ళైనా పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేసి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్‌ను తప్పు పట్టడం ఏంటని మండి పడ్డారు. గట్టిగా అరిచినంత మాత్రాన ఓట్లు పడవని పవన్ గుర్తించాలి. పార్టీ పెట్టి పదేళ్లైనా 24 సీట్లకే పోటీ చేస్తున్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలని స్టేజ్‌లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని రోజా ఎద్దేవా చేశారు.