ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అల్లర్లు ఎంత కలకలం కలిగించాయో తెలిసిన విషయమే. పాల్వాయి గేట్ బూతులో తెలుగుదేశం నేతలు చేస్తున్న రిగ్గింగ్ పై ఎన్నికల అధికారులకి , పోలీసులకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని దీంతో రిగ్గింగుని వైసీపీ నేతలే ఈవీఎం ధ్వంసం చేసి అడ్డుకున్నట్టు జరిగిన ఘటనను పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే ఎన్నికల కమీషన్ దగ్గర మాత్రమే ఉండాల్సిన పాల్వాయి గేటు బూత్ సీసీ టీవి ఫుటేజ్ లోని కొంత భాగం వరకు కట్ చేసి లోకేష్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయడం పెద్ద దుమారమే రేపింది.
ఎన్నికల అధికారులు సైతం ఆ సీసీ టీవీ ఫుటేజ్ ని పూర్తిగా పరిశీలించకుండా తమ దగ్గర ఉండాల్సిన వీడియో లోకేష్ దగ్గరికి ఎలా వెల్లింది అనే సున్నితమైన అంశాన్ని కూడ పరిగణంలోకి తీసుకోకుండా నేరుగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం అందరిని అశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈసీ అధికారుల వైఖరిని తప్పుపడుతూ కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి గారి వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆయనకి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 6వ తేదీ వరకు వాయిదా వేసింది.