చంద్రబాబు అంటే మోసం, మోసమే చంద్రబాబు నైజం అనే మాట పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న విషయం మనకు తెలిసిందే. చంద్రబాబును నమ్మితే నట్టేట మునగడమే తప్ప, బాగుపడిన వాళ్లు కూడా ఎవరూ లేరు అంటూ రాజకీయ ఉద్ధండులు చెబుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు చరిత్రలో చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో మరోసారి చంద్రబాబు మోసపూరిత వైఖరి బయటపడింది.
విషయానికి వస్తే… ఇంతకాలం పార్టీ కాడిని భుజాన మోసిన నాయకులకు రేపు జరగబోయే ఎన్నికల్లో మొండి చేయి చూపించాడు చంద్రబాబు. టికెట్లు వస్తాయి అని ఆశపడిన నేతలకు నిరాశనే మిగిల్చాడు. టీడీపీ బిజెపి జనసేన కూటమిలో భాగంగా మాట ఇచ్చిన వాళ్లను కూడా మోసం చేసాడు. ఈ నేపథ్యంలోనే పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అందరూ చంద్రబాబు పై తిరుగుబాటు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే టీడీపీకి ఇంతకాలం గొడ్డు చాకిరీ చేసి, చంద్రబాబు మోసానికి బలైపోయిన నేతలు ఒక్కొక్కరూ ఇండిపెండెంట్లు గా పోటీచేసి తమ సత్తా చాటాలని సన్నాహాలు చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే ఉండి నియోజకవర్గంలో నుంచి శివరామరాజు, నూజివీడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు, గజపతినగరం కే అప్పలనాయుడు, విజయనగరం మీసాల గీత, కురుపాం వైరిచర్ల వీరేష్ దేవ్, పాతపట్నం కలమట వెంకటరమణ, తుని యనమల కృష్ణుడు, మాడుగుల పైలా ప్రసాద్, ఎస్ కోట గంప కృష్ణ, అరకు దున్ను దొర, పోలవరం మొడియం సూర్యచంద్రరావు, సత్యవేడు జెడి రాజశేఖర్, హిందూపురంలో బిజెపి రెబెల్ గా పరిపూర్ణానంద, కురుపాంలో బిజెపి రెబల్ గా నిమ్మక జైరాజ్, అరకులో బీజేపీ ఎంపీ రెబెల్ గా నిమ్మక జైరాజ్ .. ఇలా అనేకమంది టీడీపీ నేతలు కూటమిలో సీట్లు దక్కక వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు. ఒకపక్క జగన్ సిద్ధం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలతో బహిరంగ సభలతో రాజకీయవేడిని మరింత పెంచుకుంటూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతుంటే… సొంత పార్టీ నేతలు రెబల్స్ గా మారి ఎదురు దాడి చేయడం చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది రెబల్స్ గా మారతారో తెలియక ఈ ముసలంతో టిడిపి పరిస్థితి అగమ్యగోచరమైంది.