మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి చౌదరి కుమారుడు ‘ట్రాన్స్ట్రాయ్’ యజమాని రాయపాటి రంగారావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. రెండు దఫాలుగా తన కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ కోసం రాయపాటి చౌదరి చేసిన ప్రతిపాదనలని చంద్రబాబు పట్టించుకోకపోవడంతో రాయపాటి చౌదరి కుమారుడు చంద్రబాబు పై ధ్వజమెత్తారు.
అంతే కాక, కమీషన్ల కోసం పోలవరాన్ని బాబు లోకేష్ వాడుకున్నారని, ప్రతి సోమవారం సమీక్ష చేసింది లంచాల కోసమేననీ, టీడీపీ 75 శాతం పూర్తి చేసిందనేది పచ్చి అబద్ధమని చంద్రబాబు వైఖరిపై కుండ బద్దలుకొట్టారు. గత ఎన్నికల ముందు మేమే టీడీపీకి రూ.150 కోట్లు ఇచ్చామని తెలిపారు.
“కియా” తెచ్చాను గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అనంతలో ఎందుకు అభ్యర్థులను గెదిపించుకోలేకపోయారని విమర్శించారు. లోకేశ్ రాయలసీమలో ఎందుకు పోటీ చెయ్యడు?
అక్కడ పోటీ చేసేంత దమ్ము, ధైర్యం లేవా? అంటూ ఎద్దేవా చేసారు. ఆపై తన కార్యాలయంలో గోడకు ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి మరీ పార్టీ నుంచి బయటికి వెళ్తున్నట్టు ప్రకటించారు.
బాబు, లోకేష్ విజయవాడ గుంటూరు కేంద్రంగా కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, ఒకరికొకరికి తెలియనివ్వకుండా డబ్బులు తీసుకున్నారని, లోకేశ్, చంద్రబాబు ఎంతెంత తీసుకున్నారో మా వద్ద లెక్కలు ఉన్నాయని చెప్పారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో నాశనం చేసారు
చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమే మమ్మల్ని హింసించి ప్రతి వారం డబ్బులు వసూలు చేసారని, పోలవరం ను బాబు ఏటీయంలా వాడుకున్నారని చంద్రబాబు చేసిన కుటిల రాజకీయాలను బయటపెట్టారు. అందుకేనేమో జాతీయ ప్రోజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రాన్ని కట్టనివ్వకుండా నేను కడతాను అని బాబు తీసుకున్నది.