ప్రజాగళం పేరుతో రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు చంద్రబాబు. ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు. రోడ్ షోలు బహిరంగ సభలతో కేడర్లో ఉత్సాహం నింపడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బాబు ప్రసంగాలు ఏమాత్రం ఉత్తేజాన్ని నింపకపోగా ఎప్పటిలాగే మూసధోరణి లోనే చప్పగా సాగుతున్నాయి. ఎప్పటిలాగే అన్ని నేనే అన్నిటికీ నేనే అని చెప్పుకునే తన గొప్పల గప్పాలతోనే సాగుతున్నాయి. ఎంత కష్టపడినా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లలేకపోతున్నానని అభద్రతాభావమో లేక వయసు ప్రభావమో తెలియదు కానీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు.
తన పర్యటనలు బహిరంగ సభల్లో భాగంగా రావులపాలెం సభలో మాట్లాడుతూ కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని విమర్శలు చేశాడు. వైశ్య సామాజిక వర్గం పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. దీంతో ఆగ్రహించిన కిరణా షాప్ వ్యాపారులు నిరసనగా కిరాణా షాపుల్లో గంజాయి ఎక్కడ అమ్ముతున్నారో వచ్చి చూపించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అక్కడ వ్యాపారులు అంతా బంద్ పాటించి మేము గంజాయి అమ్మడం నిజమైతే వచ్చి చూపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు.
నిజంగా చంద్రబాబు మాటల్లో చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన ఆరోపణలు నిజమే అయితే అక్కడికి వెళ్లి. ఎక్కడ ఏ కిరాణా షాపుల్లో గంజాయి అమ్మకం జరుగుతుందో చూపిస్తే దోషులను పట్టుకున్నట్టు అవుతుంది సమాజానికి మంచి చేసినట్టు కూడా అవుతుంది.. ఇలా ఎన్నికల స్టంట్ కోసం ఏది పడితే అది మాట్లాడకుండా వాస్తవ అంశాలను చర్చిస్తే చంద్రబాబు నాయుడు వయసుకి రాజకీయ అనుభవానికి ఒక విలువ ఉంటుందని అక్కడి ప్రజలు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తపరుస్తున్నారు. బహుశా ఈ భూమిపై నేను చేస్తున్న హెరిటేజ్ వ్యాపారం, మా రామోజీ చేస్తున్న పచ్చళ్ళు, చిట్ ఫండ్ వ్యాపారాలు మాత్రమే సక్రమమైనవని, మిగతావారందరి వ్యాపారాలన్ని అక్రమమేనని చంద్రబాబు గట్టి నమ్మకం కాబోలు!