అనంతపురం జిల్లా రాప్తాడు ఆదివారం జనసంద్రంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభ ‘సిద్ధం’ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహించింది. మిలియన్ క్యాడర్ మీట్‌గా అభివర్ణించింది. ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలతో ఎన్నికల రణరంగంలో ముందున్న వైఎస్సార్సీపీ రాప్తాడు సభతో హోరెత్తించింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లు సభ విజువల్స్‌తో నిండిపోయాయి. ఇరుకు సందుల్లో కాకుండా వందల ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలంతా జయహో జగన్ నినాదంతో ఉత్సాహంగా ముందుకు సాగారు. సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు.
‘2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎనుకునే ఎన్నిక కాదు. ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మన ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధికి, డ్రామాలు ఆడే చంద్రబాబు మధ్య జరిగే యుద్ధానికి మీరు సిద్ధమా.ౖ ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే ఆలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య. ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం. పేదవారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధమేనా.ౖ వేరే రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి వచ్చిపోతున్న నాన్ రెడిడెంట్స్ ఆంధ్రాస్కు ఈ గడ్డ మీద ప్రజల మధ్య ఉంటున్న మనకు మధ్య జరగబోతుంది ఈ యుద్ధం.ౖ ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడికి ఒక సవాల్ చేస్తున్నా. 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలించారు. మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా?, అయ్యా చంద్రబాబు.. మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా?, బడికి, కాలేజీకి వెళ్లే పిల్లలకైనా ఒక్క పథకం ఉందా.. కనీసం అవ్వాతాతలకైనా మంచి చేశానని చెప్పుకొనే పరిస్థితి ఉందా? బాబు పేరు చెబితే మంచి చేశాడని, మంచి పథకం తీసుకువచ్చాడనుకోవడానికి ఒక్కటి కూడా గుర్తుకురాదు. ప్రజల ఆరోగ్యం కనీసం ఒక్క మంచి పనైనా ఉందా?ౖ బాబు వల్ల రాష్ట్రంలో బాగుపడిన స్కూల్స్, ఆస్పత్రులున్నాయా?
తన స్పీచ్ ద్వారా జగన్ అనేక ప్రశ్నలకు చంద్రబాబుకు వేశారు. ఆయన్ను, దత్తపుత్రుడిని నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్గా అభివర్ణించారు. ఎందుకంటు వాళ్లిద్దరూ ఉండేది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో. రాజకీయాలు చేసేది మాత్రం ఏపీలో. జగన్ చెప్పింది నిజమే. బాబు పేరు చెబితే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకురాదు. అధికారంలో ఉన్నంత కాలం తన వర్గానికి దోచిపెట్టాడు. వీటినే వైఎస్సార్సీపీ అధినేత అస్త్రాలుగా చేసుకుని ప్రసంగించారు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయని ధైర్యంగా వెల్లడించారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధంలో పాల్గొనేందకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్ధం సభలు ఒకదానిని మించి మరొకటి ఉంటున్నాయి. దీంతో పార్టీ నూతనోత్సాహంతో కదం తొక్కుతోంది. చొక్కా మడతపెట్టి ప్రతిపక్షానికి మరోసారి ఓటమి రుచి చూపించేందుకు జగన్ సైన్యం పూర్తిగా సిద్ధమైంది.