ఏపీలో ఎన్నికలు మొదలవ్వగానే టీడీపీకి అండగా తోడుగా చంద్రబాబు రాజగురువు అయిన రామోజీరావుపని మొదలు పెట్టారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా విశాఖ పోలీసులు, రెవిన్యూ అధికారులు చేపట్టిన తనిఖీల్లో మార్గదర్శి ఉద్యోగులు 51 లక్షల నగదుతో పాటు, 36 లక్షల రూపాయల విలువైన చెక్కలతో దొరికారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాటి లెక్కలు పోలీసులకు సమాచారం అందించాలి కానీ 48 గంటలు దాటిన ఇంత వరకూ వాటి గురించి సరైన లెక్కలు , కాగితాలు అటూ పోలీసులకు, జిల్లా ఎలక్షన్ అధికారులకు సమర్పించలేదు. తెలుస్తున్న సమాచారం మేరకు అ నిధులు టీడీపీ నాయకులకు ఎలక్షన్ ఖర్చులకు తరలిస్తున్నారు అని తెలియవచ్చింది.
గతంలో 2019 లో రామోజీరావు తన మీడియా ఈనాడు, చిట్ ఫండ్ కంపెనీ మార్గదర్శి పేరుతో టీడీపీ కి నిధులను చేరవేసింది అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు మొదలవ్వగానే మళ్ళీ టీడీపీకి నిధులు తరలించే పనిలో పడింది రామోజీరావు సంస్థ మార్గదర్శి . ఇప్పుడు తాజాగా వైజాగ్ లో యాభై ఒక్క లక్షలతో మార్గదర్శి ఉద్యోగులు దొరికారు వాటికి ఈ క్షణం వరకు లెక్కలు చెప్పలేదు , తిరిగి ఈ వార్తలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ డబ్బులు సీతంపేట బ్రాంచ్ నుంచి తీసుకువస్తున్నాట్టు తెలిసింది. ఇప్పుడూ రామోజీరావు ఆ డబ్బు మాది అని క్లెయిమ్ చేసుకొని సరైన ఆధారాలు చూపకపోతే అ 87 లక్షల రూపాయల నగదు, చెక్కులు సీజ్ చేసి ఐటీ శాఖకు కేసును అప్పగిస్తారు.
గతంలో రామోజీరావు ప్రభుత్వ అధికారుల దొంగ సంతకాలతో భూములు కొట్టేసాడు ఇప్పుడు కూడా దొంగ సంతకాలతో ఫేక్ ఆధారాలు చూపుతాడు ఏమో అని ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా వేచి చూస్తున్నారు .
ఇవి రామోజీరావు మీడియా సంస్థలు కావు టీడీపీకి డబ్బులు మోసే డంప్ యార్డ్ లు .